Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్ష‌కుల చ‌ప్ప‌ట్లే గొప్ప విజయం - ఒకే ఒక జీవితం థ్యాంక్స్‌ మీట్ శ‌ర్వానంద్‌

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (17:40 IST)
Sharwanand, Amala Akkineni, Vennela Kishore, sai kartik, SR Prabhu
హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారంనాడు చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది.
 
శర్వానంద్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తర్వాత థియేటర్ మొత్తం లేచి చప్పట్లు కొడుతున్నారు. ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది. దీని కోసమే కదా సినిమాల్లోకి వచ్చామనిపించింది. ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుందనే అటుంచితే థియేటర్ లో చప్పట్లు వినాలనిపించింది. ప్రేక్షకులు నేను కోరుకున్న ప్రేమని ఇచ్చారు. సినిమా చూసిన అందరూ హత్తుకుంటున్నారు. ఇంతకంటే ప్రేమ ఏం కావాలి. నా చుట్టూ పక్కల వున్న వాళ్ళంతా నేను సక్సెస్ కొట్టాలని కోరుకున్నారు. ఇదే నా మొదటి సక్సెస్. వంశీ శేఖర్ చాలా ఆప్యాయంగా హత్తుకున్నారు. నన్ను నడిపిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో చేసిన అందరూ చాలా డిఫరెంట్ గా అనిపించాం. దీనికి కారణం మా దర్శకుడు శ్రీకార్తిక్. ఇంత గొప్ప కథని రాసిన శ్రీకార్తిక్ కు కృతజ్ఞతలు. అతని మొదటి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా వుంది. అమల గారితో పని చేయడం గౌరవంగా వుంది. అమల గారు కనిపించగానే థియేటర్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమల గారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సుజీత్ సినిమాని అద్భుతంగా చూపించారు. నిర్మాత ప్రభుగారు ధైర్యం గల నిర్మాత. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం వుండాలి. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. వర్డ్ అఫ్ మౌత్ తో సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రేక్షకులు. ప్రతి షోకి ప్రేక్షకులు డబల్ అవుతున్నారు. ఈ రోజు షోలు మొత్తం ఫుల్ అయ్యాయి. ప్రేక్షకులు, మీడియా మిత్రులు సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సక్సెస్ వారిదే. ప్రేక్షకులకు అందరికీ కృతజ్ఞతలు. ఒకే ఒక జీవితం. ఎంజాయ్ యువర్ లైఫ్'' అన్నారు
 
అమల అక్కినేని మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం ప్రేక్షకులకు నచ్చింది. అందరూ సినిమాని ప్రశంసిస్తున్నారు. శర్వానంద్ పరిపూర్ణ నటుడు. శర్వాతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. రీతూ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి అందరూ చక్కగా చేశారు. శ్రీకార్తిక్ సినిమాకి అద్భుతంగా దర్సకత్వం వహించారు. నిర్మాత ప్రభు గారు చాలా సాహసం గల నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. సుజిత్ శ్రీజిత్ జేక్స్ బిజోయ్ ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. యువత ధైర్యంగా జీవితాన్ని ఎదురుకొని విజయం సాధించే మార్గం చూపే సినిమా ఇది. ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ సినిమాని ఎంతో గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు''అని తెలిపారు.
 
నిర్మాత ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ.. సినిమాకి అన్ని ప్రాంతాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం పని చేసిన మా టీంకి కృతజ్ఞతలు. సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మరోసారి మా టీం తరపున కృతజ్ఞతలు' అని తెలిపారు
 
వెన్నెల కిషోర్ మాట్లాడుతూ..నేను చాలా స్ట్రాంగ్ అని ఫీలౌతా. కానీ ఇందులో అమల గారి ఎంట్రీ తర్వాత కన్నీళ్లు ఆగలేదు. ఈ సినిమాలో మంచి పాత్రని ఇచ్చిన దర్శకుడు కార్తిక్ కి కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాని ఇప్పించిన శర్వానంద్ కి థాంక్స్. ప్రియదర్శి కూడా చాలా సపోర్ట్ చేశారు. అమల గారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' తెలిపారు
 
 శ్రీకార్తిక్ మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సినిమా అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం గొప్ప విజయంగా భావిస్తున్నా. సినిమాని చూసిన ప్రేక్షకులు చాలా తృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ గారి నటనని ప్రేక్షకులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. శర్వానంద్- అమల గారు తల్లీ కొడుకులు గా ప్రేక్షకుల మనసుని హత్తుకున్నారు. వెన్నెల కిషోర్ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. చిరకాలం గుర్తిండిపోయే సినిమా ఇది. మీ ఫ్యామిలీ తో కలసి సినిమాని థియేటర్ లో చూసి ఆనందించండి'' అని కోరారు.
 
సుజీత్ మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా వుంది. శర్వానంద్, అమల గారి తో పని చేయడం సంతోషంగా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని తీశారు. పచాలా నిజాయితీగా తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు అంతే గొప్పగా ఆదరించడం ఆనందాన్ని ఇస్తుంది'' అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments