Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖిలాడి'' నుంచి థర్డ్ సింగిల్‌ రిలీజ్

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (12:35 IST)
"ఖిలాడి'' నుంచి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. "అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే .. ఒంట్లో వేడికే పిచ్చెక్కు తాంది నాడికే" అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట బీట్ బాగుంది. యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది. 
 
రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి మీనాక్షి చౌదరి పరిచయమవుతోంది. మరో కథానాయికగా డింపుల్ హయతి అందాల సందడి చేయనుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
సమీరా భరద్వాజ్ తో కలిసి దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. మాస్ ఆడియన్స్‌కి వెంటనే పట్టేసే తేలికైన పదాలతో విన్యాసాలు చేయించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకి ప్రధానమైన బలం అని చెప్పాలి. ఎప్పటిలానే రవితేజ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు అదరగొట్టేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments