Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలెబ్రిటీలకు కరోనా.. అధర్వ, నటి సమీరా రెడ్డి కోవిడ్ పాజిటివ్

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (15:08 IST)
సెలెబ్రిటీలకు కరోనా సులభంగా సోకుతోంది. షూటింగ్‌లు, ఇతరత్రా ప్రోగ్రామ్‌ల కోసం బయట తిరిగే సెలెబ్రిటీల్లో చాలామందికి ఇప్పటికే కరోనా సోకింది. తాజాగా తమకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలియజేస్తూ కోలీవుడ్‌ నటుడు ఆధర్వ, నటి సమీరా రెడ్డి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. 'కోవిడ్‌ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో వెంటనే వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాను. 
 
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యులు సూచన మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. కొవిడ్‌ నుంచి కోలుకుని అతి త్వరలో మిమ్మల్ని అలరించేందుకు వస్తానని ఆశిస్తున్నా' అని ఆధర్వ ట్వీట్‌ చేశారు.
 
అలాగే శనివారం తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని.. సమీరా రెడ్డి తెలిపింది. "మేము ఆరోగ్యంగానే ఉన్నాం. దేవుడి దయ వల్ల అత్తయ్యకు నెగెటివ్‌ వచ్చింది. ప్రస్తుతానికి మేము ఇంట్లోనే ఉంటూ తగిన చికిత్స పొందుతున్నాం. మరింత ధైర్యంగా ఉండాల్సిన సమయమిది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి" అని సమీరా రెడ్డి తాజాగా పోస్ట్‌ పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments