Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో అథర్వ

Webdunia
మంగళవారం, 2 మే 2023 (16:21 IST)
Karthik Raju
ప్రస్తుతం కంటెంట్ చిత్రాలకు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అటు కమర్షియల్ చిత్రాలను ఆదరిస్తూనే, ఇటు ప్రయోగాత్మక చిత్రాలకు పెద్ద పీట వేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. నూతన దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే అథర్వ అంటూ ఓ సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యువ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా నటీ, నటులుగా తెరకెక్కుతున్న కొత్త సినిమా "అథర్వ". 
 
డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఇది వరకే విడుదల చేసిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌, టీజర్, ఫస్ట్ లుక్ ఇలా అన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా  రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు ఇప్పుడు ఇచ్చారు.
 
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని, ఈ సినిమాను జూన్‌లో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాకు శ్రీచరణ్‌ పాకాల సంగీతాన్ని అందించారు. ఎస్. బి. ఉద్దవ్ ఎడిటర్‌గా పని చేశారు. చరణ్‌ మాధవనేని కెమెరామెన్‌గా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థి తండ్రితో టీచరమ్మ పరిచయం - అఫైర్.. ఆపై రూ.20 లక్షల డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments