Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆతీంద్రీయ శ‌క్తులు పుట్టించే ఫోన్ క‌థ‌తో చతుర్ముఖం

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (16:30 IST)
Chaturmukham
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఫ్లాట్‌ఫామ్ ఆహాలో వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌, వైవిధ్య‌మైన వెబ్ ఒరిజిన‌ల్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టెక్నో హార‌ర్ థ్రిల్ల‌ర్ ఆగ‌స్ట్ 13న విడుద‌ల‌వుతుంది. మంజు వారియ‌ర్‌, స‌న్నీ వేనె, శ్రీకాంత్ ముర‌ళి త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రాన్ని రంజిత్ కామ‌ల శంక‌ర్‌ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి మ‌ల‌యాళ మాతృక‌.. బుసాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్(బీఐఎఫ్ఏఎన్‌), చుంచియాన్ ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌(సీఐఎఫ్ఎఫ్‌), మేలిస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్‌(ఎంఐఎఫ్ఎఫ్‌) ఇలా ప‌లు అంత‌ర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శిత‌మైంది. ఈ సినిమా తెలుగు పోస్ట‌ర్‌ను `ఆహా` గురువారం విడుద‌లైంది. 
 
చతుర్ముఖం.. ప్ర‌స్తుత కాలానికి చెందిన తేజ‌స్విని అనే మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన మ‌హిళ జీవితం చుట్టూ తిరిగే క‌థ‌. ఈమె స్నేహితుడు ఆంటోనితో క‌లిసి సీసీటీవీ సోల్యుష‌న్స్ వ్యాపారాన్ని చేస్తుంటుంది. ఆమె త‌న మొబైల్ ఫోన్‌కు విప‌రీతంగా అల‌వాటు ప‌డుంటుంది. ఓ ప్ర‌మాదంలో ఆ ఫోన్ ప‌ని చేయ‌కుండా పోతుంది. అప్పుడు త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ ఫీచ‌ర్స్ ఉన్న బ్రాండెడ్ కానీ ఓ మొబైల్ ఫోన్‌ను తేజ‌స్విని కోనుగోలు చేస్తుంది. ఫోన్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆమె చుట్టూ ఆతీంద్రీయ శ‌క్తుల ప్ర‌భావంతో కొన్ని పనులు జ‌రుగుతుంటాయి. అవి ఆమె ఉనికికే ప్ర‌మాదంగా మారుతాయి. ఇలాంటి ప్ర‌మాదం నుంచి ఆమె ఎలా బ‌య‌ప‌డింది. ఎలాంటి ప‌రిష్కారం క‌నుగొంద‌నేదే క‌థ‌. భార‌తీయ సినిమాల్లో అరుదైన జోన‌ర్‌లో వ‌చ్చిన చిత్ర‌మే చ‌తుర్ముఖం. సినిమా చూసే ప్రేక్ష‌కులు ప్ర‌తి నిమిషం థ్రిల్ అవుతుంటారు అని ఆహా` తెలియ‌జేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments