Bigg Boss 4: ఆఖరికి కళ్యాణ్ కృష్ణకి ఆ ఛాన్స్ ఇచ్చారా..?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (14:04 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు అనే సినిమా చేయనున్నాడని.. గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ... ఇప్పటివరకు బంగార్రాజు గురించి ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ రాలేదు. దీంతో అసలు బంగార్రాజు ఉందా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది.
 
ఇప్పుడు నాగార్జున వైల్డ్ డాగ్ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా గురించి అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది. 
దీంతో కళ్యాణ్ కృష్ణతో బంగార్రాజు లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నాగార్జున చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకున్నారు.
 
ఇంతకీ దేని కోసం అంటే...బిగ్ బాస్ 4 సీజన్ ప్రొమో కోసం. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేసారు. ఈ ప్రొమోకి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ ప్రొమోను రిలీజ్ చేయనున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆఖరికి కళ్యాన్‌ కృష్ణకు బిగ్ బాస్ 4 ప్రొమోని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారన్నమాట అంటున్నారు. మరి.. బంగార్రాజు మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇంకెప్పుడు ఇస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments