Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ థియేటర్ కట్టిన ప్రభాస్..

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (16:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ కలిగిన ‘వి ఎపిక్’ మల్టీప్లెక్స్ త్వరలో ప్రారంభం కానుంది. యు.వి.క్రియేషన్స్ సినీ నిర్మాణ సంస్థ అధినేతల్లో ఒకరైన వేమారెడ్డి వంశీ నెల్లూరుకి చెందిన వ్యక్తి కావడం వల్ల ఈ మల్టీప్లెక్స్ నిర్మాణంలో ప్రధాన భాగస్వామిగా మారి, దీనిని నిర్మించారు.
 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ మల్టీప్లెక్స్‌లో భాగస్వామి అనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నెల 30న విడుదల కానున్న 'సాహో' చిత్రంతో ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ ప్రారంభంకానున్నాయి.
 
ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం మూడు థియేటర్‌లు ఉన్నాయి. ఈ థియేటర్‌లో 102.6 అడుగులు వెడల్పు, అలాగే 56 అడుగుల ఎత్తుతో కర్వ్‌డ్ సిల్వర్ స్క్రీన్ ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద సిల్వర్ స్క్రీన్స్‌లో ఇది మూడవది కావడం విశేషం. 
 
ఆసియాలో అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ కూడా ఇదే. ఈ మల్టీప్లెక్స్‌లో 647 సీట్ల కెపాసిటీతో ఒక థియేటర్, 140 సీట్ల కెపాసిటీతో రెండు థియేటర్స్‌ను నిర్మించారు. ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి అతిథిగా ఎవరు వస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. రెబల్‌స్టార్ కృష్ణంరాజు లేదా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభోత్సవానికి విచ్చేయవచ్చని టాక్ నడుస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments