Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

దేవీ
శుక్రవారం, 13 జూన్ 2025 (13:45 IST)
Vijay Antony, Suresh babu
హీరోగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా విజయ్ ఆంటోని ఎప్పుడూ ఆడియెన్స్‌ను కొత్త పాయింట్‌తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఆయన నటిస్తూ, నిర్మించిన నూతన చిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు.

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీని జూన్ 27న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌ విలన్‌గా పరిచయం అవుతున్నారు.
 
రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. మళ్లీ విజయ్ ఆంటోని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్, కొత్త పాయింట్‌ను టచ్ చేశారని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఇక ఇలాంటి కొత్త కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని అందించడంలో సురేష్ ప్రొడక్షన్స్ ముందుంటుందన్న సంగతి తెలిసిందే. ‘మార్గన్’ మీదున్న నమ్మకంతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు.
 
జూన్ 27న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు హీరో, నిర్మాత విజయ్ ఆంటోని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
 
ఈ చిత్రంలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 
 
ఈ చిత్రానికి యువ.ఎస్ సినిమాటోగ్రఫర్‌గా, విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం సమకూర్చగా.. రాజా.ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.
 
తారాగణం: విజయ్ ఆంటోని, అజయ్ ధీషన్, సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments