Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీ-సెన్సార్ తో ఆమోదం పొంది.20న విడుదలవుతున్న అశ్విన్ బాబు హిడింబ

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (15:18 IST)
Ashwin Babu
సినిమాని సర్టిఫై చేయడానికి సెన్సార్ అధికారుల నుంచి అభ్యంతరాలు రావడానికి రకరకాల కారణాలు వుంటాయి. 'హిడింబ' సినిమా విషయానికి వస్తే మొదట సెన్సార్ అధికారుల నుంచి క్లియరెన్స్ పొందింది, ఐతే కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు భావించారు. అంటే హింస ఎక్కువగా ఉందని అందుకనే రివ్యూ కమిటీ వేశారని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. నేడు  రీ-సెన్సార్ చేసి ఆమోదం పొందింది.
 
'హిడింబ' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో సినిమాను ప్రమోట్ చేయనున్నారు మేకర్స్‌. "ఇండియన్ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథ & ఇంతకు ముందేవరూ టచ్ చేయని జానర్‌ "అని రిలీజ్ డేట్ పోస్టర్‌లో ఉంది. నిజానికి, థియేట్రికల్ ట్రైలర్ కూడా అదే సూచించింది. యూనిక్ కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని థ్రిల్ ని ఇచ్చే విధంగా ఈ చిత్రాన్ని మలిచారు దర్శకుడు అనీల్ కన్నెగంటి.
 
AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పణలో OAK ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) పతాకంపై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. నందితా శ్వేత, అశ్విన్ కి జోడి గా నటిస్తున్నారు.  
 
బి రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ కాగా, వికాస్ బాడిసా సంగీతం సమకూరుస్తున్నారు.
 
తారాగణం: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, షిజ్జు, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన డీఆర్డీవో

రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం : సీఎం రేవంత్ రెడ్డి

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. ట్రంప్‌కు నిక్కీ హేలీ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments