Webdunia - Bharat's app for daily news and videos

Install App

డి.ఎస్.ఆర్. నిర్మాతగా వచ్చిన వాడు గౌతం గా అశ్విన్ బాబు

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (16:09 IST)
Clap by Damodara Prasad
అశ్విన్ బాబు, పాలక్  లాల్వాని, విలక్షణ  నటుడు నాజర్, కాంతారా ఫెమ్ అచ్యుత్, ఆర్.జె. హేమంత్, సంజ జనక్, మాధవి నటిస్తున్న చిత్రం "వచ్చిన వాడు గౌతం". శ్రీ శైలేంద్ర  సినిమాస్ పతాకంపై డి.ఎస్.ఆర్. నిర్మిస్తున్నారు. ఎం .ఆర్. కృష్ణను  నూతన దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో  ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత దామోదర ప్రసాద్ ముహూర్తము సన్ని వేశానికి  క్లాప్ కొట్టగా, నిర్మాత బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర  గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకులు ఏ. యస్. రవి కుమార్, వి. సముద్ర, నటుడు రాజా రవీంద్ర లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
 
అనంతరం నటుడు,  చిత్ర నిర్మాత డి. యస్ రావ్ మాట్లాడుతూ.. కరోనా తర్వాత చాలా మంది నిర్మాతలు  సినిమాలు తీసి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే నేను చాలా రోజులు బ్రేక్ తీసుకొని సినిమా తీస్తున్నాను. దర్శకుడు యం ఆర్. క్రిష్ణ చెప్పిన మెడికో త్రిల్లర్ కథ,  హీరో అశ్విన్ బాబుకు, నాకు కూడా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. సురేష్ బాబు, కంటెంట్ బాగుంటేనే సినిమాలు ఆడతాయి అని చెప్పడంతో ఈ కథను  సురేష్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లో కథ చెప్పించి అందరికీ కథ ఒప్పించి వారి బ్లెస్సింగ్స్ తో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాను. దర్శకుడు  హీరో అశ్విన్ బాబును కొత్త కోణంలో చూపించ బోతున్నారు. పెద్ద పెద్ద సినిమాలు చేసిన  టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రానికి  “ వచ్చిన వాడు గౌతం” అనే టైటిల్ పెట్టడం జరిగింది. జనవరి నుండి రెగ్యులర్ షూట్ మెదలు పెట్టి వైజాగ్, హైదరాబాద్ లలో రెండు షెడ్యూల్స్ లలో షూటింగ్  కంప్లీట్ చేసుకొని నటీ, నటులు టెక్నిషియకన్స్ అందరి సహకారంతో మేలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ చిత్రంలో పాలక్ లాల్వాని హీరోయిన్ గా చేస్తుంది. అలాగే నాజర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక నుండి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తియ్యడానికి రెడీ అయ్యాను. త్వరలో ఒక యూత్ హీరోతో కూడా  ఒక సినిమా చేస్తున్నాను. మంచి కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments