Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా అందమైన మనవరాలులో భాగస్వామి అయినందుకు సంతోషంగావుంది : ఆశా భోంస్లే

ఠాగూర్
మంగళవారం, 12 మార్చి 2024 (15:08 IST)
"ది ప్రైడ్ ఆఫ్ భారత్ - ఛత్రపతి శివాజీ మహారాజ్" చిత్రంలో తమ అందమైన మనవరాలు జనై భోంస్లే భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ గాయని ఆశా భోంస్లే వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తన మనవరాలు జనై భోంస్లే భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతుందని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నా మనవరాలు భాగం కావడం పట్ల నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 
 
పైగా, ఆమె భారతీయ చిత్రపరిశ్రమలో జనై కోరుకుంటున్న గమ్యస్థానాన్ని చేరుకుంటుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఆమెకు, సినిమా తీస్తున్న దర్శకుడు సందీప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని ఆశా భోంస్లే తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోంసాలే పాత్రలో ఆమె మనవరాలు జనై కనిపించనుంది. ఈ చిత్రం ద్వారా సందీప్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇమ్మెరో స్టూడియో, లెజెండ్ స్టూడియో కలిసి దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 19, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ చిత్రంలో జనైని ఎంపిక చేయడం పట్ల చిత్ర నిర్మాత సందీప్ సింగ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. "ఛత్రపతి శివాజీ మహారాజ్ కుటుంబ వంశానికి చెందిన వారసుడు, చాలా తెలివైన, నిష్ణాతులైన కుటుంబంతో తన వంశాన్ని పంచుకున్న జనైని పరిచయం చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దివంగత లతా మంగేష్కర్‌జీ, ఆశా భోంస్లేజీలకు మనవరాలు. రాణి సాయి బాయి పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేస్తుంది" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments