Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ మృతిపై స్పష్టత : ఎలా చనిపోయాడో తేల్చిన ఎయిమ్స్!

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (12:44 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఉన్న అనేక సందేహాలకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) స్పష్టత నిచ్చింది. నిజానికి సుశాంత్ ఉరి వేసుకుని చనిపోయాడని కొందరు, కాదు చంపేశారనీ మరికొందరు ఇలా అనేక రకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ కీలక విషయాన్ని వెల్లడించింది. సుశాంత్ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడని తేల్చింది. 
 
సుశాంత్ మృతికి గల కారణాలను సుదీర్ఘంగా పరిశీలించిన ఎయిమ్స్‌ వైద్యులు మంగళవారం తమ తుది నివేదికను సర్కారుకు సమర్పించారు. ఆయన మృతదేహంలో ఎలాంటి విషం ఆనవాళ్లు లేవని అందులో స్పష్టంచేశారు. సుశాంత్‌ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడని తెలిపారు.
 
ఆయన డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించామని, ఆ తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని తెలిపారు. సుశాంత్‌ మృతికి సంబంధించి గతంలో మహారాష్ట్ర వైద్యులు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
ఆ నివేదికలో తేలిన అంశాలే తమ పరిశీలనలోనూ నిర్ధారణ అయ్యాయని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పారు.ఆయన మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని వైద్యులు భావిస్తున్నారు. 
 
కాగా, సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో మృతి చెందాడు. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్‌ వ్యవహారం కూడా బయట పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments