Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూఖ్ పుత్రుడి కేసు.. కీలక సాక్షి గుండెపోటుతో మృతి

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (21:58 IST)
ముంబై శివారులో గత అక్టోబర్ నెలలో ఓ నౌకలో జరుగుతున్న రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పట్టుబడటంతో ఈ కేసు సంచలనంగా మారింది.
 
కేసు విచారణ కూడా అంతే సంచలనం అయింది. విచారణ అధికారి సమీర్ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆతర్వాత ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ రావడం, కేసు విచారణ కొనసాగడం తెలిసిందే. అయితే ఇప్పుడీ కేసుకి సంబంధించి కీలక సాక్షి సెయిల్ మరణంతో కలకలం రేగింది. 
 
రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో ఎన్సీబీ అధికారులు, ఆర్యన్ సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసవిని అప్పట్లో సాక్షిగా పరిగణించింది ఎన్సీబీ. ఆ డిటెక్టివ్ కి బాడీగార్డే ప్రభాకర్ సెయిల్. ప్రభాకర్ ని కూడా సాక్షిగా పేర్కొంది ఎన్సీబీ.
 
ఈ  డ్రగ్స్‌ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్‌ మృతి చెందారు. ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందినట్టు అతడి తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. 
 
ప్రభాకర్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారని, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మరణించారని చెప్పారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments