కీలక రోల్‌లో అరవింద్ స్వామి.. బాల సినిమాలో సూపర్ ఛాన్స్..
ధృవ విలన్ అరవింద్ స్వామి కీలక పాత్రను పోషించనున్నారు. లేటు వయసులో ఒకే ఒక్క చిత్రంతో స్టార్‌డమ్ సాధించి అందరికీ షాక్ ఇస్తున్నారు. జయంరవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో వచ్చిన 'తనీ ఒరువన్'లో అరవింద్‌స్వ
ధృవ విలన్ అరవింద్ స్వామి కీలక పాత్రను పోషించనున్నారు. లేటు వయసులో ఒకే ఒక్క చిత్రంతో స్టార్‌డమ్ సాధించి అందరికీ షాక్ ఇస్తున్నారు. జయంరవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో వచ్చిన 'తనీ ఒరువన్'లో అరవింద్‌స్వామి విలక్షణ విలనిజం ప్రేక్షకుల్ని అలరించింది. దీంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరోకొద్ది రోజుల్లో తమిళ చిత్రం 'బోగన్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయనకు బంపర్ ఆఫర్ వచ్చింది.
'తారాతప్పట్టై' తరువాత ప్రముఖ దర్శకుడు బాలా తెరకెక్కించబోయే కొత్త చిత్రంలో కీలకపాత్రకు అరవింద్‌స్వామిని ఎంపిక చేశారు. బాలా చిత్రంలో రోల్ కోసం తనతో సంప్రదింపులు జరిపినట్టు అరవింద్‌స్వామి కూడా స్పష్టం చేశారు.