Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో సెన్సేషనల్‌లో ఆర్కా మీడియా... ఈసారి బుల్లితెరపై... ఏం చేస్తుందో తెలుసా?

ఆర్కా మీడియా అనగానే.. గుర్తుకువచ్చేది.. 'బాహుబలి' సినిమా. రెండు భాగాలుగా తీసిన ఆ సినిమాతో ఆ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. 'బాహుబలి' చిత్రం సెస్సేషనల్‌ హిట్‌ అయింది. ఆ చిత్రం తర్వాత కోలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌లోనూ ఆ సినిమాపై ఏదో

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (22:07 IST)
ఆర్కా మీడియా అనగానే.. గుర్తుకువచ్చేది.. 'బాహుబలి' సినిమా. రెండు భాగాలుగా తీసిన ఆ సినిమాతో ఆ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. 'బాహుబలి' చిత్రం సెస్సేషనల్‌ హిట్‌ అయింది. ఆ చిత్రం తర్వాత కోలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌లోనూ ఆ సినిమాపై ఏదో సందర్భంలో చర్చించుకునేవారు. ఇండియాలో అయితే సరేసరి. 
 
ప్రధాన మంత్రి మోది కూడా టైటిల్‌కు తగినట్లు తమ ప్రభుత్వం పనిచేస్తుందని పోల్చుకునేవారు. అంతటి ఖ్యాతి సంపాదించుకున్న ఆర్కా మీడియా సంస్థ ఇప్పుడు ఏమయింది? వందల కోట్ల కలెక్షన్లకు శ్రీకారం చుట్టి తెలుగులో చరిత్ర సృష్టించిన ఆ సంస్థ నుంచి ప్రస్తుతం ఎటువంటి చిత్రం రాకపోవడం చిత్రమేమరి. మరి ఆ నిర్మాతలు గమ్మునవున్నారా? లేదా ఏదైనా బృహత్తర వ్యూహాన్ని చేస్తున్నారా? అనేది చాలామందిలో మెదులుతుంది. అయితే వారందరికీ ఆశ్చర్యం కల్గించే  విషయం ఒకటి చేయబోతుంది. 
 
అదేమిటంటే... వెండితెరపై 'బాహుబలి' వంటి కల్పిత కథను తెరకెక్కించిన ఆ సంస్థ  ప్రస్తుతం సినిమాలు చేయడంలేదు. అంటే.. కొంత గ్యాప్‌ తీసుకుంది. అంత భారీస్థాయిలో సినిమా తీసిన ఆ బేనర్‌ నిర్వాహకులు ఇప్పుడు బుల్లితెరపై సెస్సేషనల్‌ క్రియేట్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలింనగర్‌లో కథనాలు జోరందుకున్నాయి. అయితే అలాంటి ఇలాంటి సీరియల్స్‌ కాకుండా... రోజూ మహిళా ప్రేక్షకులు, పెద్దలు రొటీన్‌ సీరియల్‌ కథలు చూసి చూసి విసిగిపోతున్న తరుణంలో సరైన సీరియల్‌ను నిర్మించే పనిలో వున్నారు. 
 
వెండితెరపై 'బాహుబలి'ని మరిపించిన తరహాలోనే బుల్లితెరపై కూడా 'అంతకుమించి' వుండేట్లుగా మెగా సీరియల్‌ను నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్స్‌ పనులు కూడా జోరందుకున్నాయి. విదేశాలకు చెందిన దాదాపు ఆరు స్టూడియోలు సాంకేతిక పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
 
కథ ఎలా వుండబోతోంది? దర్శకుడు ఎవరు?
అయితే మెగా సీరియల్‌ కథ ఎలా వుండబోతోందని ఉత్కంఠ అందరిలోనూ వుంది. ఈ మెగా సీరియల్‌ కూడా జానపదం, సోషియో ఫాంటసీ కలగలిపి తెరకెక్కించే పనిలో వున్నారు. ఇప్పటికే ఈ మెగా ప్రాజెక్ట్‌ను ప్రముఖ ఛానల్‌లో ప్రసారం చేసేందుకు పైలైట్‌ ఎపిసోడ్స్‌ కూడా పూర్తయినట్లు సమాచారం. అవి చూసిన ఛానల్‌ నిర్వాహకులు 'అయ్యారే!' అన్నట్లుగా స్పందించడంతో ఇది మరో సెస్సేషనల్‌ క్రియేట్‌ చేయనుందడంలో ఏ మాత్రం సందేహంలేదు. 
 
మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు ఇప్పటికే రామోజీ ఫిలింసిటీలో 10 కోట్లతో ఓ సెట్‌ వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు... దర్శకుడు కీలకం. బాహుబలిని కె. రాఘవేంద్రరావు శిష్యుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తే.. ఈ మెగా సీరియల్‌ను ఆయన శిష్యుడు, సీరియల్స్‌ రూపొందించడంలో రాజమౌళికి సమకాలీకుడు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మెగా ప్రాజెక్ట్‌ గురించి మరిన్ని వార్తలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments