4 పాటలతో 'అరవింద సమేత' ఆడియో జ్యూక్‌బాక్స్ ... పెనివిటి సాంగే హైలెట్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం అరవింద సమేత వీరరాఘవ. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చేనెల 11వ తేదీన దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (14:18 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం అరవింద సమేత వీరరాఘవ. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చేనెల 11వ తేదీన దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించి సాంగ్ చిత్రీక‌రణ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన రెండు సాంగ్స్ విడుద‌ల చేయ‌గా వీటికి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది.
 
ఎస్.ఎస్. థమన్ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రంలోని మిగిలిన పాటల కోసం సంగీత‌ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం యూట్యూబ్‌లో ఆడియో జ్యూక్ బాక్స్ విడుద‌ల చేశారు. కేవ‌లం నాలుగు పాట‌ల‌తో కూడిన జ్యూక్ బాక్స్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. 
 
ఈ ఆడియోలో 'ఏడ పోయినాడో.., అనగనగనగా, పెనివిటి, రెడ్డి ఇక్కడ సూడు' అనే పాటలు ఉన్నాయి. రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు ప్రీ రిలీజ్ వేడుక‌ని ఘ‌నంగా నిర్వ‌హించి సినిమాపై ఆస‌క్తిని పెంచాల‌ని టీం భావిస్తుంద‌ట‌. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, నాగ బాబు త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

రెండోసారి కూతురే పుట్టిందని 10 నెలల పసికందును హతమార్చిన కన్నతండ్రి

హైదరాబాద్‌లో వున్న పేషెంట్‌కి చైనా నుంచి ఆపరేషన్ చేసిన భారతీయ వైద్యుడు

పెనుకొండ జాతీయ రహదారి.. రెండు ట్రక్కులు ఢీ.. ట్రక్కు డ్రైవర్ సజీవ దహనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments