Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరిని నిలిపివేయించిన పూణె పోలీసులు.. ఎందుకంటే?

Webdunia
మంగళవారం, 2 మే 2023 (11:22 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్‌కు మహారాష్ట్రలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన నిర్వహించిన సంగీత విభావరిని పూణె పోలీసులు నిలిపివేశారు. అనుమతి ఇచ్చిన సమయం మించిపోవడంతో పోలీసులు ఈ విధంగా నడుచుకున్నారు. 
 
ఆదివారం రాత్రి పూణెలోని రాజా బహదూర్ మిల్స్‌లో రెహ్మాన్ సంగీత కచేరి జరిగింది. ఇందులో రెహ్మాన్ చివరి పాట పాడుతుండగా పోలీసులు ప్రవేశించారు. అప్పటికే రాత్రి పది గంటలు అయిందని, ఇచ్చిన సమయం కంటే ఎక్కువ సమయం ఉండటానికి వీల్లేదని, కచేరీని నిలిపివేయాలని కోరారు. పూణెలో రాత్రి పది గంటల వరకే కచేరీలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని రెహ్మాన్ వివరించారు. 
 
అందువల్ల కచేరీని తక్షణం ముగించాలంటూ స్పష్టం చేశారు. దీంతో రెహ్మాన్ చివరి పాట పాడి తన కచేరిని ముంగించారు. అయితే, ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. రెహ్మాన్ తమిళ భాషా అభిమాని. ఇటీవల ఓ వేదికపై తన భార్యను కూడా హిందీలో మాట్లాడొద్దు.. తమిళంలో మాట్లాడలని సూచించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అందుకే పూణె పోలీసులు ఆ విధంగా నడుచుకున్నారనే విమర్శలు చెలరేగాయి. 
 
దీనిపై పూణె జోన్ 2 డీసీపీ స్మర్తానా పాటిల్ వివరణ ఇచ్చారు. నిర్ధేశించిత సమయం దాటిపోయిందన్న విషయాన్ని గుర్తించకుండా రెహ్మాన్ పాడుతూనే ఉన్నారని, దాంతో వేదిక వద్ద ఉన్న పోలీసులు కచేరిని నిలిపివేయాలని ఆయనకు సూచించారని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా రెహ్మాన్‌కు వివరించడం జరిగిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments