Webdunia - Bharat's app for daily news and videos

Install App

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

దేవీ
శనివారం, 5 ఏప్రియల్ 2025 (08:00 IST)
Rehman, buchibabu
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్నచిత్రం ‘పెద్ది’. శ్రీరామ నవమి సందర్భంగా పెద్ది ఫస్ట్ షాట్‌ను రిలీజ్ చేయబోతూన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫస్ట్ షాట్‌కు సంబంధించిన పనుల్ని పూర్తి చేశారు. ఇక ఏప్రిల్ 6న ఈ ఫస్ట్ షాట్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ ఫస్ట్ షాట్ ఏప్రిల్ 6న ఉదయం 11:45 గంటలకు విడుదల కానుంది.
 
ఫస్ట్ షాట్ విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా బుచ్చి బాబు సానా, సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తుది మిక్సింగ్ పనిని పూర్తి చేశారు. ఈ ఆదివారం ఫస్ట్ షాట్‌ గ్రాండ్‌గా విడుదల కానుంది. అభిమానులు ఇప్పుడు ఏప్రిల్ 6న ఈ గ్లింప్స్‌ను చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఫస్ట్ షాట్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
 
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెద్ది చిత్రం టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో అభిమానుల అంచనాల్ని పెంచేలా పెద్ది ఫస్ట్ షాట్ పవర్-ప్యాక్డ్ విజువల్ ట్రీట్‌ ఇస్తుందని చిత్రయూనిట్ హామీ ఇస్తోంది.
 
ఈ చిత్రంలో యువ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు.
 
ఈ చిత్రం గురించి మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో రానున్నాయి. ప్రస్తుతం పెద్ది ఫస్ట్ షాట్ కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments