'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో హీరోయిన్‌గా లక్ష్మీపార్వతినే పెట్టుకోండి : వర్మకు సోమిరెడ్డి సలహా

వివాదాస్పద చర్యలు, ప్రకటనలతో నిత్యం మీడియా ప్రచారం కోసం వెంపర్లాడే దర్శకుడు రాంగోపాల్ వర్మ అని, ఆయనో పనీపాటలేని వ్యక్తి అంటూ ఏపీ రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (06:21 IST)
వివాదాస్పద చర్యలు, ప్రకటనలతో నిత్యం మీడియా ప్రచారం కోసం వెంపర్లాడే దర్శకుడు రాంగోపాల్ వర్మ అని, ఆయనో పనీపాటలేని వ్యక్తి అంటూ ఏపీ రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. 
 
టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే చిత్రాన్ని నిర్మించనున్నట్టు ఆర్జీవీ ప్రకటించిన విషయంతెల్సిందే. ఇందులో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు అంశాలతో పాటు అనేక నెగెటివ్ అంశాలు ఉండే అవకాశాలు ఉన్నట్టు ఆర్జీవీ సూచన ప్రాయంగా వెల్లడించారు. 
 
దీనిపై మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాల్లో ఉంటారని, తీసిన సినిమాలు హిట్టయ్యేలా చూసుకోవాలని సూచించారు. "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే సినిమా తీయడం సంతోషకరం. త్యాగశీలి లక్ష్మీపార్వతి.. సినిమాలో హీరోయిన్‌గా ఆమెనే పెట్టుకోమనండి అంటూ సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, ఈ చిత్రానికి వైకాపా నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి పెరగనున్న ప్రైవేట్ బస్సు ఛార్జీలు.. విమానం ఛార్జీలే మేలట..

రోడ్డు ప్రమాదంలో సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం

Male Nurse: మహిళా వైద్యులు, పీజీ మెడికోలు బట్టలు మార్చే వీడియోలు తీసిన మేల్ నర్స్

టూర్లు.. జల్సాలు.. అమ్మాయిలతో ఎంజాయ్.. కరేబియన్ పౌరసత్వం.. ఐబొమ్మ రవి బాగోతాలు..

వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments