Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క నిశ్శ‌బ్ధం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (22:28 IST)
అనుష్క తాజా చిత్రం నిశ్శ‌బ్ధం. మాధ‌వ‌న్‌తో క‌లిసి న‌టిస్తున్న ఈ చిత్రంలో దాదాపు 100కి పైగా సినిమాల్లో న‌టించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ తొలిసారి ఈ ఇండియ‌న్ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో రూపొందుతోన్న‌ ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
 
ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... అనుష్క జులై 21కి సినిమా రంగంలో ప్ర‌వేశించి 14 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్నాయి. ఈ సంద‌ర్భంగా నిశ్శ‌బ్ధం ఫ‌స్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ హేమంత్ మ‌ధుక‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. తెలుగులో నిశ్శ‌బ్ధం టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీని హాలీవుడ్‌లో సైలెన్స్ అనే టైటిల్‌తో రిలీజ్ చేయ‌నున్నారు.
 
పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ అధినేత‌ టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న ఈ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీలో హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ‌స‌న్, బాహుబ‌లి ఫేమ్ సౌతిండియా లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క‌, పాన్ ఇండియా స్టార్ ఆర్.మాధ‌వ‌న్‌ల‌తో పాటు సుబ్బ‌రాజు, అంజ‌లి, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

ఢిల్లీ సీఎంపై దాడి ఘటనపై కేంద్రం సీరియస్ : జడ్ కేటగిరీ భద్రత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments