అసలు పేరు స్వీటీ.. అనుష్క అనే పేరు ఎలా పెట్టుకున్నానంటే?: దేవసేన

అందాల నటి అనుష్క అసలు పేరు స్వీటీ. స్వీటీ అనే పేరును పిన్నమ్మ పెట్టిందని.. తల్లిదండ్రులు సాయి భక్తులు కావడంతో సాయి అన్న పేరు కలిసొచ్చేలా మరో పేరు పెట్టాలని వారు అనుకున్నా, అది వాయిదా పడుతూ వచ్చిందని అ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (11:00 IST)
అందాల నటి అనుష్క అసలు పేరు స్వీటీ. స్వీటీ అనే పేరును పిన్నమ్మ పెట్టిందని.. తల్లిదండ్రులు సాయి భక్తులు కావడంతో సాయి అన్న పేరు కలిసొచ్చేలా మరో పేరు పెట్టాలని వారు అనుకున్నా, అది వాయిదా పడుతూ వచ్చిందని అనుష్క తెలిపింది. ఆపై స్కూల్లో కూడా స్వీటీ అనే పేరునే రాసి చేర్పించారని, అదే నాపేరని చెబితే, అందరూ నవ్వుతూ ఉండేవాళ్లని దేవసేన చెప్పుకొచ్చింది. దీంతో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. 
 
ఇక సినిమాల్లో వచ్చిన తర్వాత సూపర్ షూటింగ్ సెట్లో స్వీటీ.. స్వీటీ అని సెట్లో పిలుస్తుంటే బాగాలేదని నాగార్జున, సోనూసూద్‌లతో పేరుపై డిస్కస్ చేశానని తెలిపింది. వారు పేరు మార్చుకోవాలని సూచించారని గుర్తు చేసుకుంది. ఇక తక్షణమే తండ్రికి ఫోన్ చేసి పేరు మార్చుకోవాలన్న కోరికను చెప్పి, మంచి పేరును సూచించమని చెప్పగా.. ఎవరికి జీవితంలో తన పేరును తాను పెట్టే అవకాశం దక్కదని.. తనకు అవకాశం వచ్చిందని పండగ చేసుకో.. నీ పేరు నువ్వే పెట్టుకో.. అని చెప్పేశారని అనుష్క వెల్లడించింది. 
 
వెబ్ సైట్లు, పిల్లల పుస్తకాల పేరు వెతికి.. మూడు నెలల పాటు శ్రమించి అనుష్క అన్న పేరును కనిపెట్టుకున్నానని తెలిపింది. ఇక పేరు మార్చుకున్న తరువాత దానికి అలవాటు పడేందుకు తనకు ఏడాదికి పైగానే సమయం పట్టిందని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments