Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క 48 .. సరోగసీ కాన్సెప్ట్ తో నవీన్ పోలిశెట్టి.. దేవసేన సినిమా

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (17:02 IST)
'జాతి రత్నాలు' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నవీన్ పోలిశెట్టి అనుష్క శెట్టితో కలిసి రాబోయే చిత్రంలో తెరను పంచుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలచేసింది. 
 
రాబోయే డ్రామాకు తాత్కాలికంగా అనుష్క 48 అని పేరు పెట్టారు. రుద్రమదేవి ఫేమ్ నటి నవీన్ పొలిశెట్టి పోషించిన స్టాండప్ కమెడియన్ తో ప్రేమలో పడిన మధ్య వయస్కురాలైన చెఫ్ పాత్రలో నటిస్తుంది. అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం సరోగసీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
 
సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన 'రా రా కృష్ణయ్య' చిత్రానికి దర్శకత్వం వహించిన పి.మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి యూవీ క్రియేషన్స్ సంస్థ నిధులు సమకూరుస్తోంది. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బాహుబలి గర్ల్ అనుష్క శెట్టి చివరిసారిగా 2020లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడిన నిశ్శబ్ధంలో కనిపించిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments