Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సూపర్' నుంచి 'బాహుబలి' వరకు.. పదేళ్లు పూర్తి చేసుకున్న అనుష్క..

Webdunia
గురువారం, 23 జులై 2015 (11:07 IST)
సినీ పరిశ్రమలో నెలకొన్న పోటీనిబట్టి వెండితెరకు పరిచయమైన వాళ్లు గట్టిగా మూడేళ్లు హీరోయిన్‌గా కొనసాగడమే గొప్ప. అయితే ఏక దాటిగా పదేళ్ల పాటు హీరోయిన్‌గా కొనసాగడం గొప్ప రికార్డుగానే చెప్పుకోవచ్చును. ఆ స్థాయిలో ఇప్పటి వరకు రికార్డుకెక్కిన భామలు త్రిష, నయనతార వంటి అతికొద్ది మంది మాత్రమే పదేళ్లకుపైగా హీరోయిన్‌లుగా వెండితెరపై వెలుగుతున్నారు. ఇప్పుడు వారి సరసన అందాల తార అనుష్క కూడా చేరిపోయింది. 
 
2005లో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున సరసన 'సూపర్' చిత్రంలో వెండితెరకు పరిచయమైన అనుష్క దశాబ్ది కాలం పాటు విజయవంతంగా హీరోయిన్‌గా కొనసాగుతూ, దర్శకుడు రాజమౌళి చిత్రం బాహుబలితో పదేళ్లు పూర్తి చేసుకుంది. బాహుబలి దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లను కుమ్మరిస్తోంది. 
 
ఇతర నటీమణుల వలే హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా అనుష్క హవా కొనసాగుతోంది. తాజాగా అనుష్క నటించిన 'రుద్రమదేవి' చిత్రం సెప్టెంబర్‌ నెలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. బాహుబలి చిత్రం లాగానే రుద్రమదేవి కూడా భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం. 
 
ఈ చిత్రాన్ని 3డిలో తయారుచేశారు. ఈ చిత్రంలో టైటిరోల్ రుద్రమదేవి ప్రధాన పాత్రలో అనుష్క నటించింది. వెండితెరపై కాలుపెట్టి పదేళ్లు గడిచినా , చెక్కు చెదరని అందంతో, ఎటువంటి పాత్రలోనైనా చక్కగా ఇమిడిపోయే అభినయంతో వెలుగుతున్న అనుష్కకు ఆల్ ది బెస్ట్.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments