లైగర్‌ కొత్త లుక్‌పై దేవసేన రెస్పాన్స్..

Webdunia
శనివారం, 2 జులై 2022 (18:12 IST)
లైగర్‌ కొత్త లుక్‌పై నటి అనుష్క శెట్టి స్పందించారు. విజయ్‌ దేవరకొండ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.
 
'లైగర్‌ చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా అందరి హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నా. పూరీ సర్‌ మీ మ్యాజిక్‌ చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. విజయ్‌.. ఈ సినిమా నీ కెరీర్‌లో బెస్ట్‌ కావాలి. ఎన్నో విభిన్నమైన కథలు మాకందిస్తున్న ఛార్మి, ఆ కథలు తెరకెక్కించడంలో భాగమైన కరణ్‌జోహార్‌కు ధన్యవాదాలు'' అని అనుష్క రాసుకొచ్చారు. 
 
ఇక అనుష్క చేసిన ఈ పోస్ట్‌పై విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. 'రెడ్‌ హార్ట్‌' సింబల్‌ను షేర్‌ చేశాడు. అలాగే నటి అనుష్కను ఇండస్ట్రీకి తొలిసారి పరిచయం చేసింది పూరీ జగన్నాథ్‌ అనే విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'సూపర్' సినిమాతోనే అనుష్క ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments