Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీతో బ్రేకప్: సుల్తాన్ కోసం రెజ్లింగ్ నేర్చుకుంటున్న అనుష్క శర్మ

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (10:43 IST)
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రేమాయణం బ్రేకప్ అయ్యాక బాలీవుడ్ సుందరి సినిమాలపై బాగా దృష్టి పెట్టింది. ప్రేమ వరకు ఓకే అయితే పెళ్లి ప్రతిపాదన తేవడంతో అనుష్క శర్మ.. కోహ్లీ నుంచి దూరమైంది. సినీ ఛాన్సులు బాగా వస్తున్న తరుణంలో పెళ్ళి చేసుకుంటే ఇక కెరీర్‌కు దెబ్బేనని భావించిన అనుష్క శర్మ.. కోహ్లీకి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా పెళ్ళి చేసుకోవాల్సిందేనని కోహ్లీ పట్టుబట్టడంతో ప్రస్తుతానికి బ్రేకప్ ఇచ్చిందని బిటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో అనుష్క శర్మ తన కొత్త చిత్రం 'సుల్తాన్' కోసం చెమటోడుస్తోంది. ఈ చిత్రంలో భాగంగా తన పాత్ర కోసం ప్రత్యేకంగా రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. బ్లూ షర్ట్, బ్లాక్ షార్ట్ వేసుకుని రింగ్‌లో కోచ్ దగ్గర రెజ్లింగ్ నేర్చుకుంటుండగా తీసిన ఫోటోలను అనుష్క ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 'నో పెయిన్ నో గెయిన్, సో జస్ట్ ట్రైన్' అంటూ ట్వీట్ చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్స్‌పై అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ఈ 'సుల్తాన్' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ రెజ్లర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments