Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిప్‌కిస్‌లో అనుష్క: సైజ్ జీరోలో అనుష్క-ఆర్యల లిప్ లాక్ అదిరిపోద్దట!

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (18:25 IST)
అనుష్క లిప్‌కిస్‌ పెట్టిందంటే అది ఏ నాగార్జునకో అనే కామెంట్లు ఇండస్ట్రీలో వుండేవి. కానీ ఆయన నటించిన చిత్రాల్లో చాలా జాగ్రత్తలు తీసుకునేది. కానీ ఆ తర్వాత లక్కీగా గోపీచంద్‌తో నటించిన చిత్రంలో లిప్‌కిస్‌ ఇచ్చి యూత్‌ను ఉర్రూతలూరించింది. అనుష్కశెట్టి తెలుగులో స్పష్టంగా మాట్లాడగలదు. బాహుబలి, రుద్రమదేవి వంటి పాత్రల్లో నటించిన ఈమె తాజాగా 'సైజ్‌ జీరో'లో నటించింది. 
 
అందమైన అమ్మాయి ఒబిసిటీతో బొద్దుగా వుంటే ఆమె వైవాహిక జీవితంలో ఎటువంటి మార్పులు చేసుకున్నాయనేవి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతుందని తెలుస్తోంది. ఆమె భర్తగా ఆర్య నటించాడు. సమాచారం మేరకు.. ఓ సన్నివేశంలో.. ఆమె తన లావుగురించి ఆలోచిస్తూ... ఊహల్లో జీరోసైజ్‌లో వుంటే ఎలా వుంటుందని ఊహించుకుంటూ కలలు కంటుంది. ఆ క్రమంలోనే ఓ డ్రీమ్‌ సాంగ్‌ చేసుకుంటుంది. 
 
ఆ పాట కూడా.. కమల్‌ నటించిన క్షత్రియపుత్రుడులోని.. సన్నజాజి పడక.. అనేది రీమిక్స్‌ అద్భుతంగా తీశాడని టాక్‌ వినపడుతోంది. కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన భార్య కనిక కూడా ఈ పాటను ప్రత్యేకంగా డిజైన్‌ చేసిందట. ఈ సీన్‌లో అనుష్క, ఆర్యల లిప్‌కిస్‌లు యువతను ఎట్రాక్ట్‌ చేస్తాయని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments