Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచితనంతో మర్డర్ చేసే స్వీట్ హార్ట్ అనుష్క.. ఓ రేంజిలో మోసేసిన రానా

ఈ ప్రపంచంలో మంచితనానికి మరో పేరు ఏదైనా ఉందా అంటే అనుష్క పేరే ముందుగా చెప్పాల్సి ఉంటుంది. ఏ ముహూర్తంలో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిందో కానీ కర్నాటక ప్రజల సంస్కృతిలోని సాధుత్వాన్ని, సాత్వికతను,

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (11:26 IST)
ఈ ప్రపంచంలో మంచితనానికి మరో పేరు ఏదైనా ఉందా అంటే అనుష్క పేరే ముందుగా చెప్పాల్సి ఉంటుంది. ఏ ముహూర్తంలో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిందో కానీ కర్నాటక ప్రజల సంస్కృతిలోని సాధుత్వాన్ని, సాత్వికతను, సహృదయతను, సాయ పడే గుణాన్ని తన వెంట పెట్టుకుని మరీ మన వద్దకు వచ్చిందామె. ఆ రోజునుంచి ఆమె తన తల్లితండ్రులకే కాదు మనందరికీ కూడా స్వీటీ అయిపోయింది. అణకువకు, సౌజన్యానికి, మృదుభాషణకు, మార్దవానికి ఆమె ప్రతీకగా అవుతుందని వారికి కూడా అనిపించిందేమో.. పుట్టగానే ఆమెకు అమ్మా నాన్నా స్వీటీ అనే పేరే పెట్టారు. అంటే మధుహృదయం అని చెప్పుకోవచ్చు కూడా. కర్నాటకలో చదివినా, ఆరేళ్లపాటు అక్కడే యోగా టీచర్‌గా పనిచేసినా.. తర్వాత తెలుగు చిత్రసీమ అదృష్టం కోద్దీ టాలీవుడ్‌లో అడుగు పెట్టినా తాను తిని, తాగి, పెరిగిన ఆ తియ్యదనాన్నే ఆమె జీవితం పొడవునా అందరికీ పంచిపెడుతూనే ఉంది.
 
ఈరోజు దక్షిణ భారత చిత్ర సీమలో ఆమెను గురించి చెడుగా మాట్లాడుతున్న వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. స్వార్ధం, సొంత లాభం, అసూయ వంటి అవలక్షణాలన్నీ రాజ్యమేలుతున్న చిత్రసీమలో బయటి నుంచి వచ్చిన ఒక నటి ఇంత మంచిపేరు సంపాదించుకోవడం ఎలా సాధ్యం అనేది అంతు పట్టకుండా ఉంది. కొత్తగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన వారికి అనుష్క ఇచ్చే సహకారం, తన వద్ద ఉన్నది పంచుకోవడం మరెవరిలోనూ చూడలేదని తమన్నా ఆమెను ఆకాశమంత ఎత్తులో నిలిపి ప్రశంసించినప్పుడు అనుష్క క్వాలిటీ ఏమిటో తొలిసారిగా అందరికీ అర్థమైపోయింది. 
 
ఇక ఏ సినిమాలో అయినా సరే షూటింగ్ జరిగేంత సేపూ ప్రతి ఒక్కరితో స్నేహ సంబంధాన్ని కొనసాగించండంలోనూ అనుష్కే మంచి మార్కులు సంపాదించుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాహుబలిలో ఆమెను పాతికేళ్లపాటు బంధించి ఉంచిన భళ్లాల దేవ పాత్రధారి రానా అయితే..  చెడ్డవారిని కూడా మంచివారుగా మార్చివేసే మహత్తర శక్తి అనుష్క అంటూ ఓ రేంజిలో మోసేశాడు. బాహుబలి 2 ప్రమోషన్‌లో భాగంగా మూడు వారాల క్రితం  V6 News చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ సావిత్రితో అనుష్క గురించి రానా చెప్పిన విషయాలు తన మాటల్లోనే విందామా..
 
"ప్రపంచంలోనే నేను కలిసిన వ్యక్తుల్లో మంచికి ఒక పరాకాష్ట ఎవరంటే ఒక స్వీటీ యే. అంటే బై మిస్టేక్ ఆమెతో ఉండి మనం కూడా మంచోళ్లం అయిపోతామేమో అనే కంగారు ఉంది. మనం ఎంత చెడ్డవాళ్లంగా ఉన్నాసరే ఆమె ముందు మనం కూడా మంచోళ్లమే అయిపోతాం ఆవిడతో ఉన్న స్పెషాలిటీ అది. మంచితనంతో మర్డర్ చేసేస్తుంది.. హండ్రెడ్ పర్సెంట్.. అందరినీ అన్నమాట. ఎవరిని బడితే వారిని మంచివాళ్లుగా మార్చిపడేస్తుందామె." అని మంచితనంతో మర్డర్ చేసే అనుష్క గురించి ప్రశంసల వర్షం కురిపించాడు రానా..
 
ఒక డైరెక్టర్‌ని, ఒక ప్రొడ్యూసర్‌ని, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టును ఎవరిని అడిగినా సరే. అనుష్క సచ్ ఎ స్వీట్ హార్ట్ అంటారు. నిజం అది. నేనిలా అంటుంటే సిగ్గుపడుతున్నావా అనుష్కక్కా అంటూ యాంకర్ సావిత్రి అనుష్కను మరో రేంజిలో మోసేసింది. 
దానికి ప్రభాస్ అందుకుని మనం చెడ్డవాళ్లుగా మారిపోతున్నామేమో అని డౌట్ వచ్చినా సరే.. కాస్పేపు స్వీటీతో ఉంటే మనల్ని మళ్లీ స్వీట్‌గా చేసేస్తుంది అని ఇంకాస్త ఎక్కించాడు. 
 
బాహుబలి2 ప్రమోషనల్ కార్యక్రమాల్లోనే అద్బుతంగా చేసిన ఇంటర్వ్యూ ఇది. వి6 చానెల్ యాంకర్ సావిత్రి గురించి చెప్పనవసరం లేదు తెలంగాణ యాసలో యాంకరింగ్‌కు కొత్త అర్థం చెప్పిన సంచలన యాంకర్ ఆమె. ప్రభాస్ అనుష్క, రానాతో ఆమె చేసిన ఇంటర్వ్యూ బాహుబలి టీమ్‌తో తెలుగు మీడియా చేసిన ఇంటర్వ్యూలలో తలమానికం లాంటిదని చెప్పవచ్చు. దీంట్లో రానాను ఆమె ఎంతగా ఆడుకుందో మాటల్లో చెప్పలేం. ప్రభాస్ నాలుగేళ్ల కష్టాన్ని మర్చిపోయి పడీ పడీ నవ్విన ఇంటర్వ్యూ ఇది. ఓపిక ఉంటే మిస్ కాకుండా కింది లింకులో దీన్ని పూర్తిగా చూడవచ్చు.
 
Baahubali 2 Movie Team Exclusive Interview With Savitri | Prabhas | Anushka | Rana | V6 News
https://www.youtube.com/watch?v=zTWXa6toZj8
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments