Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత రేంజిలో వళ్లు పెంచావు గద జేజెమ్మా.. వాపోతున్న బాహుబలి యూనిట్

బాహుబలి సిరీస్ అంటేనే గ్రాఫిక్స్ కీలకం అన్న సంగతి తెలిసిందే. దీనికోసం భారీ ఖర్చు కూడా తప్పదు. అయితే ఇప్పుడు బాహుబలి 2 కోసం ఈ గ్రాఫిక్స్ ఖర్చు మరి కొంచెం పెరిగిందట. ఖర్చే కాదు, వర్కంగ్ టైమ్ కూడా పెరిగుతోందట. దీనికి కారణం మరేం కాదు, హీరోయిన్ అనుష్క.

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (03:00 IST)
బాహుబలి ది బిగినింగ్‌లో గ్రాఫిక్స్ మాయాజాలం దేశదేశాల జనాలను మెస్మరైజ్ చేసింది. ఈ ఏప్రిల్ 28న రాబోతున్న బాహుబలి ముగింపు భాగంలో తొలి భాగానికి మించిన గ్రాఫిక్స్ మాయాజాలం ఉంటుందని ఆ సినిమా నిర్మాతలు చాలాకాలంగా ఉరిస్తున్న విషయం తెలిసిందే. ఆ గ్రాఫిక్స్ మాయాజాలం మాహిష్మతి కోట అందాలను, యుద్ధదృశ్యాలను చూపించడంలోనే కాకుండా అనుష్క ఆకారాన్ని తగ్గించి చూపడంలో కూడా ఇప్పుడు కసరత్తు చేస్తున్నట్లు వినికిడి. గ్రాఫిక్స్ ఖర్చు కోట్లలో పలుకుతుంటే అనుష్క పిజిక్‌ను నాజూకుగా మార్చడానికి ఇంకాస్త ఖర్చు అయేటట్టుందని నిర్మాతలు వాపోతున్నారు. 
 
సైజ్ జీరో సినిమా తరువాత అనుష్క ఓ రేంజ్ లో వళ్లు చేసిన సంగతి తెలిసిందే. అనుష్క ఫిజిక్ తగ్గితే బాహుబలి 2 బ్యాలెన్స్ వర్క్ చేద్దామని రాజమౌళి చాలా ట్రయ్ చేసాడు. కానీ అనుష్క ఫిజిక్ రాజమౌళి ఆశించిన మేరకు తగ్గలేదట. ఆఖరికి వీలయినంత అడ్జెస్ట్ చేసుకుంటూనే వర్క్ ఫినిష్ చేసేసారట. ఇప్పుడు అనుష్క ఫేస్ లోని ఉబ్బును, బాడీలో అదనపు ఫ్యాట్ ను తెరమీదకు రాకుండా చేసే పనిని గ్రాఫిక్స్ జనాలకు అప్పగించారని సమాచారం.
 
మరోరకంగా చెప్పాలంటే బాహుబలి గ్రాఫిక్స్ కాంట్రాక్ట్‌కు ఇది అదనం అన్నమాట. అనుష్కను వీలయినంత మెరుపుతీగలా, అందంగా చూపించే పనిలో ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ వీరులు బిజీగా వర్క్ చేస్తున్నట్లు వినికిడి. సినిమా చూస్తే ఈ వైనం తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు స్వీటీ ఎలా వుందో బయట అప్పుడప్పుడు కనిపిస్తున్నపుడు తెలుస్తోంది కదా.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments