Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి మిత్రులం.. మాకు లేని బాధ మీకెందుకు.. అనేసిన అనుష్క

బాహుబలి సినిమాలో కలిసి పనిచేసిన కో స్టార్లలో ప్రభాస్‌కు మంచి స్నేహితుడిగా, రానాకు మంచి సోదరుడిగా మార్కులేసిన దేవసేన అనుష్క తానన్న మాట నుంచి ఇసుమంత కూడా పక్కకు తప్పుకోలేదు. మంచి స్నేహితుడు మంచి ప్రేమిక

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (06:17 IST)
బాహుబలి సినిమాలో కలిసి పనిచేసిన కో స్టార్లలో ప్రభాస్‌కు మంచి స్నేహితుడిగా, రానాకు మంచి సోదరుడిగా మార్కులేసిన దేవసేన అనుష్క తానన్న మాట నుంచి ఇసుమంత కూడా పక్కకు తప్పుకోలేదు. మంచి స్నేహితుడు మంచి ప్రేమికుడు కాలేడా. ఎందుకు కాలేడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ గత నెలరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో కొన్ని వేల సార్లు ప్రభాస్-అనుష్కలకు పెళ్లి చే(రా)సేసిన మహానుభావులందరికీ అనుష్క నమస్కార బాణం సంధిస్తోంది తప్ప ఒక్కసారి కూడా వారి ఆశలను, అభిప్రాయాలను ఒకే చేసే ప్రకటన మాత్రం చేయలేదు. ఇప్పటికీ ఆమె ప్రభాస్‌ను మంచి స్నేహితుడు మాత్రమే అంటూండటం విశేషం.
 
ప్రభాస్, అనుష్క వెండితెరపై కెమిస్ట్రీ అనే పదానికి మారుపేరుగా నిలిచిన అద్భుతమైన జంట. చలనచిత్రరంగంలో ఒక జంటను ఇంత గొప్పగా స్వీకరించిన, ఆదరించిన ఘటన మరెవరి విషయంలోనూ సాధ్యం కాలేదు. ఈ జంట ఇప్పటికే నాలుగు తెలుగు చిత్రాల్లో కలసి నటించింది. అవన్నీ సక్సెస్‌లే. తాజా చిత్రం బాహుబలి –2 అయితే ఈ జంటను ప్రపంచ సినిమాకే పరిచయం చేసింది. 
 
బిల్లా, మిర్చి, బాహుబలి ది బిగినింగ్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించినా రాని గుర్తింపు, ప్రశంసలు బాహుబలి ది కంక్లూజన్ సినిమాతో ప్రభాస్, అనుష్క జంటకు వచ్చాయి. కోట్లమంది భారతీయ ప్రేక్షకులు బాహుబలి-2 లో ప్రభాస్, 
అనుష్క మధ్య సీన్లను చూసి ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదు. స్త్రీపురుషుల మధ్య ప్రేమను, సాన్నిహిత్యాన్ని ఇంత గొప్పగా ప్రదర్శించిన వారి నటనను నిజజీవితంలో కూడా పదిలపర్చుకోవాలని, సినిమా పరిశ్రమలోనే ఇంత చక్కటి జంటను తామెన్నడూ చూడలేదని ఆన్‌లైన్, ఆప్ లైన్ ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. 
 
తమ అభిమాన జంటపై ప్రేక్షకుల క్రేజీ ఎంత పీక్‌కి వెళ్లిందంటే ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమాయణం జరుగుతుందనే ప్రచారం కాస్త ఎక్కువగానే జరుగుతోంది. ఇటీవల నటి అనుష్క దైవ పూజలు నిర్వహించడంతో పెళ్లి సక్రమంగా జరగాలనే ఈ పూజలు అంటూ ప్రచారం హోరెత్తింది.
 
తాజాగా ప్రభాస్‌ నటిస్తున్న భారీ చిత్రం సాహోలోనూ అయ్యకు జంటగా అనుష్కనే నాయకి అనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రానికి అనుష్కను సిఫారసు చేసింది ప్రభాసే అని కూడా సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీంతో ఈ జంట మధ్య సాగుతున్న ప్రేమ వ్యవహారం నిజమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
 
అయితే ఇలాంటి ప్రచారానికి మరో వైపు కూడా ఉంది. ప్రభాస్‌కు వధువు ఖరారైందని, ఒక వ్యాపారవేత్త కూతురిని ఆయన వివాహం చేసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏది నిజం అన్నది ఇదమిద్దంగా తెలియకపోయినా, తాజాగా నటి అనుష్క స్పందిస్తూ తాను, ప్రభాస్‌ తెరపై సరైన జోడీ అని, అయితే నిజంగానే తామిద్దరం మంచి మిత్రులం అని పేర్కొంది. 
 
కానీ అనుష్క మంచి మిత్రులం అన్న వ్యాఖ్యలను సినీ వర్గం మరో విధంగా భావిస్తోంది. అవును వారిద్దరూ మంచి ప్రేమికులు అన్నదే వారి భావన. ఈ విషయంలో ప్రభాస్‌ గానీ, అనుష్క గానీ క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి బేస్‌లెస్‌ వార్తలు షికార్లు చేస్తూనే ఉంటాయి. స్నేహితులమే కానీ తమ మధ్య మరోక సంబంధం లేదని అటు ప్రభాస్, ఇటు అనుష్క ప్రకటించక పోవడంతో మమ్మల్ని వదిలేయండి బాబూ అని ఇద్దరూ మొత్తుకుంటున్నా ఆ ఇద్దరి అభిమానులు మాత్రం వదిలేటట్లు కనిపించడం లేదు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments