Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతం రివ్యూ రిపోర్ట్: రష్మీ గౌతమ్ స్వర్గం చూపించిందా..? అంతం.. ఆకట్టుకోలేదా..?!

బుల్లితెరపై ఓ వెలుగు వెలిగి గుంటూరు టాకీస్‌తో హాట్ హీరోయిన్ అంటూ ముద్ర వేసుకున్న రష్మీ గౌతమ్ ''అంతం'' సినిమా ద్వారా మంచి మార్కులే కొట్టేసింది. రష్మీ గౌతమ్, చరణ్ దీప్ నటించిన సినిమా అంతం గురువారం (7-7-

Webdunia
గురువారం, 7 జులై 2016 (17:17 IST)
సినిమా : అంతం 
నటీనటులు : రష్మీగౌతమ్, వాసుదేవ్, సుదర్శన్, చరణ్ దీప్ తదితరులు,
కథ.. స్క్రీన్‌ప్లే, కూర్పు, దర్శకత్వం: జి.ఎస్‌.సి.పి. కల్యాణ్‌, 
సంగీతం: కార్తీక్‌ రాడ్రిగ్జ్‌, 
పతాకం: శ్రీ గాయత్రి ఆర్ట్‌ మూవీస్‌,
నిర్మాణం: జి.సత్యనారాయణ, 
విడుదల తేదీ: 7-7-2016
 
 
బుల్లితెరపై ఓ వెలుగు వెలిగి గుంటూరు టాకీస్‌తో హాట్ హీరోయిన్ అంటూ ముద్ర వేసుకున్న రష్మీ గౌతమ్ ''అంతం'' సినిమా ద్వారా మంచి మార్కులే కొట్టేసింది. రష్మీ గౌతమ్, చరణ్ దీప్ నటించిన సినిమా అంతం గురువారం (7-7-2017) రిలీజైంది. ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన తన భార్యను అమాయకుడైన భర్త ఎలా కాపాడుకున్నాడనే కథాంశంతో అంతం తెరకెక్కింది.

కాన్సెప్ట్ సినిమా అయినప్పటికీ ముందూ వెనక బలమైన సీన్స్ లేకపోవడం, రష్మీ కాసేపే తెరపై కనబడటం.. కథ మొత్తం కారులో తిరగడం వంటి మైనస్‌లతో సినిమాకు మంచి మార్కులు వేయకపోయినా.. రష్మీ అందాలకు మాత్రం ఘాటుగానే మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు. రష్మీ ఉన్నంత సేపే కథ రక్తి కట్టింది. మిగిలిన సీన్స్ అంతా సాదాసీదాగానే ఉన్నాయని టాక్ వస్తోంది. 
 
ఇంతకీ కథేంటంటే?.. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే సగటు గృహిణి వనిత అలియాస్ చిన్ని (రష్మి గౌతమ్). భర్త బుజ్జి (చరణ్‌దీప్‌) ఉద్యోగం రీత్యా విజయవాడ వెళ్లడంతో ఆయనకోసం ఎదురుచూస్తుంటుంది. అలా ఉద్యోగం కోసం వెళ్లిన పని పూర్తి కావడంతో కారులో హైదరాబాద్‌కి బయల్దేరిన బుజ్జికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి నీ భార్యని కిడ్నాప్‌ చేస్తున్నామని ఓ సందేశం అందుతుంది. అలా కిడ్నాప్ అయిన రష్మిని.. బుజ్జి కాపాడుతాడా లేదా..? ఉగ్రవాదుల చెర నుంచి భార్యను కాపాడేందుకు వాళ్లు చెప్పినట్లు చేస్తాడా? వాళ్లు తెమ్మని చెప్పిన బ్యాగుల్లో ఏముంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
లొసుగులున్నాయ్.. అంతం కాన్సెప్ట్ సినిమా. టెర్రరిస్టులు, బాంబులు అంటూ కథలో పెద్ద విషయాలు ప్రస్తావనకు వచ్చినా తెరపై సన్నివేశాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటాయ్. ట్రైలర్ చూసి ఇదే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తరహా సినిమా అనుకుంటే పొరపాటే విజయవాడలో మొదలై దారి గుండా సాగుతూ హైదరాబాద్‌లో ముగిసే కథ. ఉగ్రవాదులు చెప్పిన ప్రదేశాలకు వెళ్ళడం.. వాళ్లు చెప్పిన పని చేయడం వరకే హీరో పాత్ర ఉంటుంది. సుదర్శన్‌ కామెడీ అంతగా పండలేదు. మొత్తానికి సినిమా సో.. సో.. గా ఉంది. 
 
ప్లస్ పాయింట్స్.. సినిమాకి ప్రధాన ఆకర్షణగా కనిపించే రష్మి సందడి తొలి, చివరి పది నిమిషాలు మాత్రమే. తెరపై కనిపించేది కాసేపే అయినా రష్మి ప్రభావం బాగానే కనిపించింది. కెమెరా పనితనం పర్వాలేదు.
 
రేటింగ్ : 2.5

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments