Webdunia - Bharat's app for daily news and videos

Install App

హవా ఫాన్స్ ఇన్వెస్టర్, బ్రాండ్ అంబాసిడర్‌గా అనూప్ రూబెన్స్

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2022 (15:41 IST)
Anil, anoop, sanjeev
సంవత్సర కాలం క్రితం హవా ఫ్యాన్స్ కంపెనీ ని స్థాపించి నిర్విరామ కృషితో పోటీ మార్కెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్, సంజీవ్, దివ్య. ఇప్పుడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌తో జతకలిసి మరింత ముందుకు వెళ్తున్నారు. కరోనా లాక్ డౌన్ లో ఇబ్బందులు వచ్చిన హవా ఫాన్స్‌కి మంచి గుర్తింపు వచ్చింది. కేవలం 28 వాట్స్‌తో నడిచే ఫ్యాన్ 65 % కరెంట్‌ను ఆదా చేస్తుంది. అసలు వేడి అనే మాటే ఉండదు ఈ ఫ్యాన్. ఇలాంటి గొప్ప ఫీచర్స్‌తో ఉన్న ఫ్యాన్ చూసి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ హవా ఫాన్స్ కి ఫిదా అయిపోయారు, వెంటనే ఆయన కూడా ఒక ఇన్వెస్టర్‌గా హవా ఫాన్స్ టీమ్‌తో చేతులు కలిపారు. సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అనూప్ రూబెన్స్, హవా ఫాన్స్ యజమానులు త‌మ ప్ర‌యాణాన్ని శ‌నివారంనాడు విలేక‌రుల‌తో వివ‌రించారు.
 
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ "హవా ఫాన్స్ యజమాని అనిల్ నాకు మంచి మిత్రుడు. సంవత్సర కాలం క్రితం ఈ హవా ఫాన్స్‌ని ప్రారంభించాడు. మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ హవా ఫాన్స్‌లో చాలా గొప్ప ఫీచర్స్ ఉన్నాయి  ఇది ఒక స్మార్ట్ ఫ్యాన్, 65 % కరెంటు ఆదా అవుతుంది. నోయిస్ లెస్ (Noise less), LED, స్మార్ట్ రిమోట్ మరియు రివర్స్ ఫీచర్  (Reverse Feature) ఫ్యాన్ ఇది. నేను మిడిల్ క్లాస్ అబ్బాయిని మన జీవితం లో ఫ్యాన్స్ చాలా ముఖ్యం, ప్రతి ఒక ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది. ఈ హవా ఫ్యాన్ వాళ్ళ కరెంటు ఆదా అవుతుంది, రివర్స్ ఫీచర్ ఉంది . అద్భుతమైన క్వాలిటీ, గొప్ప ఫీచర్స్ తో మార్కెట్ లో లభిస్తుంది. త్వరలో మార్కెట్ లో టాప్ లిస్ట్ మా హవా ఫ్యాన్ పేరు కూడా ఉంటుంది అని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి తెలంగాణ ఆంధ్ర మరియు కర్ణాటక మార్కెట్‌లో మా హవా ఫాన్స్ ల‌భిస్తున్నాయి. ఆన్ లైన్ మార్కెట్ లో కూడా లభిస్తుంది. రేటు కూడా చాలా తక్కువ, 4 వేల రూపాయలతో అద్భుతమైన హవా స్మార్ట్ ఫ్యాన్ ని పొందవచ్చు. త్వరలో వేరే రాష్ట్రాలు తమిళనాడు,కేరళ మరియు ఇతర రాష్ట్రంలో లభిస్తుంది. ఈ హవా ఫాన్స్ లో నేను పార్టనర్ గా ఉండటం చాలా సంతోషంగా ఉంది.
 
అనిల్ మాట్లాడుతూ "మా హవా ఫాన్స్ 4 వేల నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతానికి ఆఫర్స్ ఉన్నాయి. ఆన్లైన్‌లో అమెజాన్, ఫిలిప్ కార్ట్ మరియు jio మార్ట్‌లో ఉన్నాము. మా ఫ్యాన్స్‌ లో రివర్స్ ఫీచర్ సరికొత్త ఫీచర్. శీతాకాలం లో ఈ రివర్స్ ఫీచర్ టెక్నాలజీ చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. సరికొత్త రంగుల్లో మా ఫ్యాన్ లభిస్తుంది. మా హవా ఫాన్స్ తెలంగాణ బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ప్రస్తుతానికి విజయవాడ, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, తెలంగాణ, బెంగళూరు, మైసూరు, కర్ణాటక లో డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నాం. త్వరలో ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తాం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments