Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ తరుణ్ ''లవర్'' ఎవరో తెలుసా?

రాజ్ తరుణ్ ''లవర్'' ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకి రిద్ధికుమార్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. తాజాగా టైటిల్ లోగో

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (17:24 IST)
రాజ్ తరుణ్ ''లవర్'' ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకి రిద్ధికుమార్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. తాజాగా టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ రిలీజైంది. ఈ ఫస్ట్ లుక్‌లో ఒక అబ్బాయి చేయి.. అమ్మాయి చేయిని పట్టుకున్నట్లుంది.


హాస్పిటల్ నేపథ్యంలో హీరోహీరోయిన్లకి సంబంధించిన ఈ స్టిల్ యూత్‌లో ఆసక్తి రేకెత్తించేలా వుంది. రిద్ధికుమార్ రాజ్ తరుణ్ లవర్‌గా కనిపిస్తుందని, సినిమా ఆద్యంతం యూత్‌ను ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. 
 
ఇక వరుస పరాజయాలతో డీలాపడిన రాజ్ తరుణ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇక లవర్ ఫస్ట్ లుక్ శనివారం ఉదయం విడుదల కానున్నట్లు టైటిల్ లోగో పోస్టర్లో యూనిట్ వెల్లడించింది. 
 
మరోవైపు తమిళంలో సూపర్ హిట్ అయిన ''నానుమ్ రౌడీ ధాన్'' సినిమాను తెలుగులో రాజ్ తరుణ్ రీమేక్ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోందని, సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. 
 
తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విఘ్నేష్ శివన్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తారన్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని రాజ్ తరుణ్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశాడు. ఇది ఫాల్స్ న్యూస్ అంటూ తేల్చి చెప్పేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments