Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌మ్ముడు ఆనంద్‌ కోసం అన్న విజ‌య్ చేస్తున్న `పుష్పక విమానం`

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (14:04 IST)
‘దొరసాని’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరో ఆనంద్ దేవరకొండ తన రెండో చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆనంద్ తన మూడో సినిమాగా "పుష్పక విమానం" అనే ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేస్తున్నాడు. దామోదర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీని 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ సోమ‌వారం విడుద‌లైంది.
 
ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు దామోదర మాట్లాడుతూ, ఈ కథని న్యూస్ లో చూసి ఇన్స్పైర్ అయి దానికి నిజ జీవిత పాత్ర‌ల‌ను జోడించి తయారు చేసుకున్నాను. మొదట ఈ కథని విజయ్ దేవరకొండ ఫాదర్ గోవర్ధన్ గారికి చెప్తే ఆయనకి బాగా నచ్చడంతో ఈ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. అదే టైంలో ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమా రిలీజ్అవడంతో ఈ కథకి అతను అయితే బావుంటాడని అనుకుని ఆనంద్ దేవరకొండ హీరో గా ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనున్నాడు. ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామాని గుర్తుచేస్తూ, పెళ్లిచుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుంది. ఇందులో ఆనంద్తోపాటు సునీల్, నరేష్ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. శాన్వి మేఘన, గీత్ సాయిని నాయిక‌లుగా చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. అందర్నీ అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుద‌ల‌చేయ‌నున్నామ‌ని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments