Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్లిక్‌గా ప్రియుడికి ముద్దుపెట్టిన 'మణికర్ణిక' నటి

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (12:42 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మణికర్ణిక'. ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన నటి అంకిత లొకాండె. వాస్తవానికి ఈమె హిందీ బుల్లితెరపై మంచి పాపులర్ నటిగా ముద్రవేసుకుంది. 
 
ఈమె వెండితెరకు పరిచయంకాకముందు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌లో ప్రేమలో పడింది. కొద్దిరోజులు డేటింగ్ చూశారు. ఆ తర్వాత 2016లో విడిపోయారు. సుశాంత్ టీవీ రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేసే క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
 
ఈ నేపథ్యంలో ఇటీవల అంకిత, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్కీ జైన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ విషయమై అంకిత కొన్ని రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు. 
 
'విక్కీ చాలా మంచి వ్యక్తి. నేను అతనితో ప్రేమలో ఉన్నా. సమయం వచ్చినపుడు అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఒక వేళ పెళ్లి చేసుకుంటే మీ అందరిని పిలిచే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతానికైతే అలాంటి ప్లాన్‌లేవీ లేవు. నా ఫోకస్‌ అంతా పని మీదే ఉంది' అంటూ చెప్పుకొచ్చారు.
 
ఈ పరిస్థితుల్లో విక్కీ జైన్‌తో కలిసి అంకితా తమ స్నేహితుల పెళ్లికి హాజరయ్యారు. ఆ సందర్భంగా వారిద్దరూ పాడారు. ఆడారు. ఈ జంట సంగీతంలో మునిగిపోయి ఉండగా, విక్కీని దగ్గరకు తీసుకుని అందరు చూస్తుండగానే అంకిత లిప్‌లాక్ కిస్ పెట్టింది. దీనికి సంబంధించి వీడియోను నటుడు అర్జున్‌ బిజ్‌లానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments