Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటికెళ్లిన మాజీ ప్రేయసి.. అనుష్క భావోద్వేగ ట్వీట్

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (16:47 IST)
Ankita Lokhande
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అంత్యక్రియలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవిత్ర రిశ్తా అనే టీవి సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన సుశాంత్.. ఆపై సినిమాల్లో రాణించిన సంగతి తెలిసిందే.
 
2009లో ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సీరియల్‌లో సుశాంత్‌కు జోడీగా అంకిత లోఖండేతో సుశాంత్‌ ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లపాటు వీళ్ల ప్రేమాయణం కొనసాగింది. అయితే 2016లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - అంకిత లోఖండే ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు.
 
అప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న సుశాంత్ వేరే నటితో డేటింగ్‌లో ఉన్నాడని, అంకిత తనకి దగ్గరి వ్యక్తితో నిశ్చితార్ధం జరుపుకుందని ప్రచారం జరిగింది. సుశాంత్ మరణం తర్వాత కుంగిపోయిన అంకిత.. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు.
 
అయితే సుశాంత్ చివరి చూపు చూడాలని భావించినప్పటికీ, కరోనా గైడ్‌లైన్స్ నేపథ్యంలో ఆ అవకాశానికి నోచుకోలేకపోయింది. దీంతో అంత్యక్రియల తర్వాత అంకిత సుశాంత్ ఇంటికి వెళ్ళి వారిని పరామర్శంచి ప్రగాఢ సానుభూతి తెలిపింది. 
 
మరోవైపు భారత సినీ ప్రపంచాన్ని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కదిలించింది. సినీ ప్రముఖులు చాలామంది భావోద్వేగ ట్వీట్లు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ మృతిపై తెలుగు హీరోలు కూడా స్పందించిన సంగతి తెలిసిందే.
 
తాజాగా సుశాంత్ ఆత్మహత్యపై ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి తనదైన శైలిలో స్పందించింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. ఎపుడు మనం సంతోషాలతో పాటు బాధలు కూడా తమ సన్నిహితులతో పంచుకోవాలన్నారు. అంతేకాదు ఇతరులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా స్వీకరించాలని అందులో మంచి ఉంటే గ్రహించాలని సలహా ఇచ్చింది.
 
ఈ సందర్భంగా అనుష్క శెట్టి మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో నాతో సహా ఎవరు పర్ఫెక్ట్ కాదు. అందరిలో ఏవో కొన్ని లోపాలుంటాయి. అంత మాత్రానా జీవితాన్ని అంతం చేసుకోవాలనే నిర్ణయం సరైనంది కాదన్నారు. 
 
మనమెవరం ఏది కావాలనుకొని రోడ్డు మ్యాప్‌తో పుట్టలేదు. మనకు ఏది సరైంది అనిపిస్తుందో ఆ దారిలోనే వెళ్లాలన్నారు. మానసిక బాధలకు ఎవరు అతీతులు కాదని అనుష్క ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments