Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్-3 చిత్రంలో అంజలి.. డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా..?

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (11:29 IST)
2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ఎఫ్2. వెంకటేష్‌, వరుణ్ తేజ్, మెహరీన్, తమన్నా ప్రధాన పాత్రలలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. కామెడీతో పాటు కాస్త సెంటిమెంట్‌ను సైతం జతచేసి ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేశాడు అనీల్ రావిపూడి. 
 
ఇప్పుడు ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా, ఆగస్ట్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
 
ఎఫ్ 3 చిత్రంలో తమన్నా, మెహరీన్‌తో పాటు మరో హీరోయిన్‌కు ఛాన్స్ ఉండగా, ఆ స్థానంలో సోనాలీ చౌహాన్ను తీసుకోబోతున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కాని తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న అంజలిని మూడో క్యారెక్టర్ కోసం ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. 
 
అతి త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఎఫ్-3 చిత్రం డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలుస్తుండగా, ఇందులో రాజేంద్రప్రసాద్‌తో పాటు వెన్నెల కిషోర్, సునీల్ క్యారెక్టర్స్ కూడా ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటాయట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments