Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అంజలి'' ఛాలెంజింగ్ రోల్.. ఛాన్సులు దొరక్కపోతే హాలీవుడ్‌నే మించిపోతారా..?

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (17:21 IST)
తెలుగమ్మాయి, సినీ నటి అంజలి ఛాలెంజింగ్ రోల్ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు తగిన ఛాన్సులు దొరక్కపోవడమే కారణం. అవసరం అనుకుంటే హాలీవుడ్ భామలు కూడా చేయలేని రొమాన్స్ చేసేందుకు ప్రస్తుతం తెలుగు హీరోయిన్లు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తేజస్వి లాంటి ముద్దుగుమ్మలు పిచ్చెక్కిస్తున్నారు. తాజాగా అంజలి లెస్బియన్ పాత్రలో నటిస్తుంది. తమిళంతో పాటు తెలుగులోనూ నటించిన అంజలికి ఛాన్సులు ఈ మధ్య అంతంత మాత్రంగానే వున్నాయి. దీంతో ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. 
 
తాజాగా ''పావ కదైగల్" అనే సినిమా కోసం లెస్బియన్‌గా మారిపోయింది అంజలి. నలుగురు అగ్ర దర్శకులు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాలుగు భిన్నమైన కథలను ముడిపెడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్.. గౌతమ్ మీనన్.. సుధ కొంగర.. వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నారు.
 
నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. సాయి పల్లవి, అంజలి, ప్రకాశ్ రాజ్, కల్కి కొచ్లిన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాలుగు కథలను నలుగురు దర్శకులు డైరెక్ట్ చేసారు. అందులో అంజలి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంది. 
 
బాలీవుడ్ బ్యూటీ కల్కి కొచ్లిన్‌తో ప్రేమలో పడే పాత్ర ఇది. తను ప్రేమించిన వ్యక్తిని తీసుకొస్తానని తండ్రికి చెప్పి.. అమ్మాయిని తీసుకొస్తుంది అంజలి. పరువు అంటే ప్రాణమిచ్చే కుటుంబంలో ఇవన్నీ చెల్లవని సీరియస్ అవుతాడు తండ్రి. అక్కడ్నుంచి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది అసలు కథ. ఈ సినిమాకు తప్పకుండా సూపర్ క్రేజ్ వస్తుందని టాక్ వస్తోంది. ఇప్పటికే విడుదలై ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments