Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిస్ట్రిబ్యూటర్ నుంచి మహారాజ్ఞి తో నిర్మాత స్థాయికి ఎదిగిన అనిష్ దొరిగిల్లు

డీవీ
బుధవారం, 29 మే 2024 (10:56 IST)
Distributor Anish Dorigillu
సినిమా అంటే ప్యాషన్‌తో ఇండిస్ట్రీకి వచ్చిన నిర్మాత వెంకట అనిష్ దొరిగిల్లు. అనంతపుర్ జిల్లా వాసి అయిన వెంకట అనిష్ ఆయన చిన్న తనం నుంచి సినిమానే ప్రపంచంగా బతికారు. జిల్లాలో వారి కుటుంబానికి సొంత థియేటర్లు ఉన్నాయి. స్వయంగా ఆయనకు జిల్లాలో ఎస్వీసీ థియేటర్ ఉంది. మొదటి నుంచి సినిమా అంటే మక్కువతోటి ఎగ్జిబీటర్ స్థాయి నుంచి డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగారు. దాదాపు 17 సంవత్సరాలు డిస్ట్రిబ్యూటర్ ఫీల్డ్‌లో ఉండి.. అందులో విశేష అనుభవం గడించారు. 
 
మంచి సినిమాలు నిర్మించాలి. తద్వారా ఉపాది అవకాశాలు కల్పించవచ్చనే ఓ సామాజిక దృక్పథంతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. దూరదృష్టితో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి పూనుకున్నారు. అందులో భాగంగా భారీ తారాగణంతో రూపొందిన మహారాజ్ఞి అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రభుదేవ, కాజోల్, సంయుక్త మీనన్, నసిరుద్దిన్ షా వంటి దిగ్గజ తారాగణం, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్, సినిమాటోగ్రాఫర్ జి కె విష్ణు, ఎడిటర్ నవీన్ నూలి వంటి టెక్నికల్ టీమ్‌తో పనిచేయించుకున్నారు అంటే ఆయన బిజినెస్ థీయరీ కూడా అద్దం పడుతుంది. 
 
తాజాగా మహారాజ్ఞి టీజర్ సైతం విడుదల అయింది. అందులో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నిర్మాణ విలుల్లో ఎక్కడ తగ్గకుండా తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ వెంకట అనిష్ దొరిగిల్లు రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన చిత్రాలను, భారీ చిత్రాలను నిర్మించనున్నారు. ఇండస్ట్రిలో మంచి సినిమాలు రూపొందించి ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారని తెలుస్తుంది. నిజానికి పరిశ్రమకు ఇలాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతల అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

బీఆర్ఎస్ బాగా రిచ్ గురూ.. ఆ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు.. వామ్మో! (video)

కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments