Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్‌తో కలిసి సంక్రాంతికి వస్తాం : దర్శకుడు అనిల్ రావిపూడి

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (11:24 IST)
మెగాస్టార్ చిరంజీవితో కలిసి వచ్చే యేడాది సంక్రాంతి పండుగకు వస్తామని సినీ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. విక్టరీ వెంకటేష్‌ - అనిల్ దర్శకత్వంలో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మాత. 
 
ఇపుడు మెగాస్టార్‌తో కలిసి అనిల్ రావిపూడి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అనిల్ రావిపూడి బృందం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. చిరంజీవితో చేయనున్న సినిమా స్క్రిప్ట్‌ను స్వామి చెంతన ఉంచి పూజలు జేశారు. 
 
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో కుటుంబ కథా చిత్రం చేయనున్నట్టు తెలిపారు. జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించి, వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయడానికి ప్రణాళికలు వేసుకున్నామన్నారు. ఈ చిత్రంలో వినోదానికి ఏమాత్రం కొదవలేదన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్‌తో ప్రయాణం కొనసాగుతుందన్నారు. చిరంజీవి చిత్రంలోనూ రమణ గోకులతో ఓ పాట పాడిస్తానని అనిల్ రావిపూడి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments