Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌కు సీక్వెల్ : అనిల్ రావిపూడి వెల్లడి

Webdunia
మంగళవారం, 15 జనవరి 2019 (13:23 IST)
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో ఫన్ అండ్ ఫస్ట్రేషన్ (ఎఫ్-2) ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు నటించారు. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ, 'దర్శకుడిగా ఇదివరకు వాణిజ్య హంగులతో కూడిన యాక్షన్ సినిమాలు చేశాను. వాటికి భిన్నంగా పూర్తిస్థాయి వినోదభరిత కథాంశంతో ఓ సినిమా చేస్తే బాగుండునని అనిపించింది. పైగా, 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వంటి చిత్రం తెలుగులో వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును భర్తీ చేస్తూ భార్యాభర్తల అనుబంధానికి కామెడీని జోడించి ఈ సినిమా చేసినట్టు చెప్పారు. 
 
ఈ చిత్రం మాస్ పాటు క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చెప్పారు. వెంకటేష్ పాత్ర, ఆయన మేనరిజమ్స్ మంచి స్పందన లభిస్తున్నది. అలాగే బోరబండ కుర్రాడిగా వరుణ్ సహజమైన అభినయాన్ని కనబరిచాడు. బాలీవుడ్ గోల్ హౌస్ సినిమాల సీక్వెల్స్ ట్రెండ్ సృష్టించాయి. వాటి తరహాలో 'ఎఫ్-2'కు సీక్వెల్ చేయాలనుంది. ఈ సీక్వెల్ నటించడానికి వెంకటేష్, వరుణ్ సంసిద్ధతను వ్యక్తంచేశారని అనిల్ రావిపూడి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

పాకిస్థాన్ వంకర బుద్ధి.. కవ్వింపు చర్యలు.. ఆరు డ్రోన్లను కూల్చివేసిన భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments