Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యంతో బాధపడుతున్నా.. అలసిపోయాను.. : మలైకా అరోరా తండ్రి చివరి వ్యాఖ్యలు

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (10:03 IST)
తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, తీవ్రంగా అలసిపోయానని బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా తమ కుమార్తెలను చెప్పినట్టు సమాచారం. ఆయన బుధవారం ముంబైలో తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటన బాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. 65 యేళ్ల అనిల్ అరోరా మరణవార్తతో మలైకా కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 
 
ఈ క్రమంలోనే అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకునేముందు తన కుమార్తెలకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. తన ఇద్దరు కుమార్తెలు మలైకా, అమృతకు ఫోన్ చేసి 'నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను.. అలసిపోయాను' అని చెప్పినట్లు తెలుస్తోంది. తన తండ్రి మరణం తర్వాత ఆయన్ని తలచుకుంటూ బాధతో మలైకా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. 
 
'మా తండ్రి మరణం మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. ఆయన చాలా సున్నితమైన భావాలు కలిగిన వ్యక్తి. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ చూపేవారు. తాత, భర్త, తండ్రిగా ఎంతో అంకితభావంతో, ప్రేమతో ఉండేవారు. ఆయన ఇకలేరని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాం. ఇది తీరని నష్టం. ఈ కష్టసమయంలో మా గోప్యతను భంగం కలిగించొద్దని మీడియాను అభ్యర్ధిస్తున్నా. మాకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా' అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
 
అనిల్ అరోరా మరణించిన సమయంలో మలైకా పుణెలో ఉన్నారు. విషయం తెలియగానే ముంబై చేరుకున్నారు. నటి మాజీ భర్త, నటుడు అర్బాజ్ ఖాన్, నటుడు సల్మాన్ ఖాన్ కుటుంబం ఈ విషయం తెలిసి మలైకాను పరామర్శించారు. 'ఘటన జరిగిన చోట ఎలాంటి సూసైడ్ లేఖ లభించలేదు. పంచనామా పూర్తయ్యాకే మరణానికి సంబంధించిన స్పష్టమైన కారణం తెలుస్తుందని పోలీసు వర్గాలు చెప్పాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం జాతీయ అభివృద్ధికి కీలకం

అసెంబ్లీకి రాను, మీడియా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తా: వైఎస్ జగన్

ఎవరైనా చెల్లి, తల్లి జోలికి వస్తే లాగి కొడ్తారు.. జగన్‌కి పౌరుషం రాలేదా? (video)

పసుపు చీరతో షర్మిల ఆకర్షించిందా.. విజయసాయికి బుద్ధుందా?: బుద్ధా వెంకన్న

ట్రోలింగ్‌తో నా కుమార్తెలు కన్నీళ్లు పెట్టుకున్నారు.. పవన్ కామెంట్స్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments