Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన‌సూయ దర్జా లుక్ తో అద‌ర‌గొడుతోంది

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (18:45 IST)
Anasuya darja
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత కేఎల్ నారాయణ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఫస్ట్ లుక్ కూడా ‘దర్జా’గా ఉందని, ఈ సినిమా కూడా దర్జాగా ఆడి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని.. చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్, కెఎల్ నారాయణ, సునీల్, అనసూయ, పృథ్వీ, షకలక శంకర్‌‌తో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది.
 
Anasuya, Kamineni Srinivas, Shivshankar Paidipati, KL Narayana, Saleem Malik
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ లుక్ ఆవిష్కరించి, ఆశీస్సులు అందించిన నిర్మాత కేఎల్ నారాయణ గారికి చిత్రయూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ వేడుకకు వచ్చి.. మమ్మల్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వస్తోంది. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నం లోని అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేశాం. కామినేని శ్రీనివాస్‌గారి సపోర్ట్ మరిచిపోలేనిది. సునీల్‌గారు, అనసూయగారు, ఇతర నటీనటులు ఎంతగానో సపోర్ట్ అందిస్తున్నారు. అనసూయగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒకవైపు తండ్రి చనిపోయిన బాధతో ఉన్నప్పటికీ.. తన వల్ల షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగకూడదని షూటింగ్‌కు వచ్చి మాకు చాలా సహకరించారు. అందుకే అనసూయ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరూ.. చిత్రం ఘన విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని అభిలాషించారు.
 
సునీల్, అనసూయ, ఆమని, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ ,శిరీష, షకలక శంకర్,  మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్ ,రామ్ సర్కార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి... కెమెరా: దర్శన్,సంగీతం: రాప్ రాక్ షకీల్,ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ,కథ: నజీర్,
మాటలు: పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్, నిర్మాత: శివశంకర్ పైడిపాటి,
స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments