Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ భరద్వాజ్ పుట్టిన రోజు.. యాంకర్‌గా ప్రారంభించి యాక్టర్‌గా..?

Webdunia
శనివారం, 15 మే 2021 (11:13 IST)
జబర్థస్త్ షోలో యాంకరింగ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ. ముందుగా కేవలం గ్లామర్‌తోనే షోను రక్తి కట్టించింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ రోజు ఈ భామ పుట్టినరోజు. అంతేకాదు ఈ రోజు 34 ఏట అడుగుపెట్టింది. ఒకవైపు యాంకరింగ్‌తో ఆడియన్స్ మనసులు దోచుకున్న ఈ భామ.. నెమ్మదిగా తన అడుగులను సినిమాల వైపు వేసింది.
 
ముందుగా నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కేవలం గ్లామర్ షోకే పరిమితమైంది అనసూయ. ఆ తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’ సినిమాతో తనలో మంచి నటి ఉందని ప్రూవ్ చేసుకుంది. ఆ సినిమా తర్వాత రంగస్థలంలో రంగమ్మత్తగా అనసూయ నటనను ఎవరు మరిచిపోలేదు.
 
ఈ సినిమాలో తన పాత్రలో అన్ని రకాల భావోద్వేగాలను పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది అంతేకాదుఇపుడు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న కొత్త సినిమాలో ముఖ్యపాత్రలో యాక్ట్ చేయబోతుంది. చేసినవి  త‌క్కువ సినిమాలే అయినా త‌న‌కు గుర్తింపు వ‌చ్చే పాత్ర‌లే చేస్తుంది అన‌సూయ‌. 
 
గ్లామ‌ర్ రోల్స్ అని కూర్చోకుండా కేవ‌లం ప‌ర్ఫార్మెన్స్ ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల చుట్టూ అను తిరుగుతుంది. దాంతో ఈ జబర్దస్త్ భామను వెతుక్కుంటూ మ‌రీ  ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ భామ.. క్యారెక్టర్ నచ్చితేనే సినిమాలకు సై అంటోంది. లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమానైనా రిజెక్ట్ చేయడానికి వెనకాడటం లేదు. 
Anasuya
 
ఈ భామ కున్న పాపులారిటీతో తమ సినిమాల్లో ముఖ్య పాత్రలను ఆఫర్ చేస్తున్నారు హీరోలు. అంతేకాదు కొంత మంది దర్శకనిర్మాతలు అనసూయను దృష్టిలో పెట్టుకొని కొన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నారు. మరి పెళ్లై ఇద్దరు పిల్లలున్న ఈ భామ.. హీరోయిన్స్‌కు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో ఇటు టీవీ, అటు సినీ రంగంలో తన దూకుడు చూపిస్తోంది. 

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments