Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

దేవీ
సోమవారం, 7 ఏప్రియల్ 2025 (11:50 IST)
Ananya Nagalla
స్వతహాగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో నటిగా మారారు అనన్య నాగళ్ళ.కెరీర్ ప్రారంభంలో 'షాదీ' వంటి షార్ట్ ఫిల్మ్ లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెంటనే 'మల్లేశం' తో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాలో చక్కని కట్టు బొట్టుతో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. వెంటనే 'ప్లే బ్యాక్' అనే సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు.

దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు.అటు తర్వాత  'తంత్ర' 'పొట్టేల్' 'బహిష్కరణ'(వెబ్ సిరీస్) ' శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటి ఎన్నో వినూత్నమైన సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు.
 
ఇదిలా ఉంటే.. అనన్య నాగళ్ళ ఇప్పుడు  స్మాల్ స్కేల్ విమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. అనన్యతో రూ.5 కోట్ల బడ్జెట్లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. 'తంత్ర' 'పొట్టేల్' 'బహిష్కరణ' 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటివి ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. ముఖ్యంగా 'తంత్ర' హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతూ ఉండగా.. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో లో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ టాప్ 5 లో ట్రెండ్ అవుతుంది. 
 
 అందుకే ఇప్పుడు దర్శకనిర్మాతలు రూ.5 కోట్ల బడ్జెట్లో తీసే లేడి ఓరియంటెడ్ సినిమాలకు అనన్య నాగళ్ళ బెస్ట్ ఆప్షన్ భావిస్తున్నారు. ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు.అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు అనన్య నాగళ్ళ.ఈమె మెయిన్ లీడ్ గా ఒక హిందీ ప్రాజెక్టు కూడా రూపొందుతుంది.. అంటే ఈమె క్రేజ్, మార్కెట్ రాష్ట్రాలు దాటాయి  అని అర్దం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments