Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 ఏళ్ళ వివాహం చిరకాలం వుండాలి : మహేష్‌బాబు

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (10:06 IST)
2023 and -2005 mahesh, namrata
మహేష్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ల వివాహం జరిగి నేటికి 18 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మా జీవితం కలకాలం ఇలాగే హాయిగా వుండాలంటూ పోస్ట్‌ చేశాడు మహేష్‌. ఫిబ్రవరి 18, 2005న వీరి వివాహం జరిగింది. ముంబైలోని మారియెట్‌ హోటల్ లో నటి నమ్రత శిరోద్కర్‌ ను వివాహం చేసుకున్నాడు. వీరికి 2006న గౌతమ్‌ కృష్ణ, 2012న సితార జన్మించారు. 
 
తనతో పాటు నటించిన రాకుమారుడు సినిమాలోని నమ్రతను మహేష్‌ వివాహం చేసుకున్నాడు. అప్పట్లో వీరి వివాహం సెన్సేషనల్‌ అయింది. ఇక ఆ తర్వాత నుంచి నమ్రత కుటుంబానికే పెద్ద పీటవేస్తూ వుంది. మహేష్‌ కెరీర్‌ను ప్లాన్‌ చేస్తూ, డైట్‌ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. మహేష్‌ కాస్టూమ్స్‌ విషయంలోనూ ప్రత్యేక కేర్‌ తీసుకుంటుంది. మరోవైపు హృదయసంబంధ రోగులకు, చిన్న పిల్లలకు సేవ చేస్తూ మహేష్‌ ఫౌండేషన్‌ స్థాపించారు. అదేవిధంగా హోటల్‌, సినిమాహాల్‌ వ్యాపారంలోనూ ఎదిగారు. తాజాగా మహేష్‌ నటిస్తున్న ఎస్‌.ఎస్‌.ఎం.బి.23 సినిమాలో నటిస్తున్నారు. నిన్ననే వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. ఈరోజు పెండ్లిరోజు కాబట్టి బయట గడపడానికి వెళ్ళినట్లు అర్థమవుతుంది. వీరు ఎక్కడికి వెళ్ళారనేది వివరాలతో మహేస్‌ తెలియజేస్తారేమో చూడాలి. ఈ సందర్భంగా మహేష్‌, కృష్ణ అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా సినిరంగ ప్రముఖులు కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments