Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ బ్యూటిఫుల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (11:07 IST)
అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు సినిమాతో వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసారో తెలిసిందే. ఈ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం బ్యూటీఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయిక కాగా సూరి కధానాయకుడిగా నటించారు.

అగస్త్య మంజు దర్శకుడు. ఇప్పటికే  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా `ఎ` సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని నూతన సంవత్సరం సందర్బంగా జనవరి 1న ప్రంపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
 
రొమాంటిక్ ప్రేమ కధాంశంతో  వైవిధ్య భరితంగా మలిచిన ఈ చిత్రంలో  హీరోహీరోయిన్లు సూరి, నైనా అభినయం హత్తుకుంటుంది. సన్నివేశాలతో పాటు పాటలు మదిని దోచుకుంటాయి. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, సింగిల్స్‌కు విశేష  స్పందన లభించింది. ఇక రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన... అలాగే ఆయన చిత్రాలలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు ఎంతటి పేరు తెచ్చుకుని బిజీ అయ్యారో తెలియంది కాదు.
 
ఈ కోవలోనే లోగడ వంగవీటి చిత్రం ద్వారా పరిచయమైన నైనా గంగూలీ కూడా బాలీవుడ్, ఇంకా ఇతర భాష‌ల చిత్రాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన ఈ చిత్రంలో రొమాంటిక్ గా కనిపిస్తూ యువ ప్రేక్షక హృదయాలను కొల్లగొడుతుంది అని అన్నారు. మ‌రి.. వివాద‌స్ప‌ద చిత్రం అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్స‌స్ సాధించిన వ‌ర్మ‌.. ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments