ప్ర‌తి రోజూ జాగ్ర‌త్త‌గా వుండాలంటున్న అమితాబ్‌

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (15:26 IST)
Amitab (ig)
క‌రోనా వ‌ల్ల మ‌నుషుల్లో ఆలోచ‌న ధోర‌ణి మారింది. సెల‌బ్రిటీలు మ‌రింత జాగ్ర‌త్త‌గా వుండాల‌ని ఈ క‌రోనా వైర‌స్ సూచించింది. ముఖ్యంగా సినిమారంగానికి చెందిన ప్ర‌ముఖులంతా త‌మ‌వంతు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తెలియ‌జేసింది. ఈ విష‌యంలో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రోసారి జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు. ఆయ‌న సోమ‌వారంనాడే షూటింగ్ లో పాల్తొన్నారు. సెకండ్‌వేవ్ లాక్‌డౌన్ ఎత్తివేశాక ఆయ‌న సోమ‌వారం ఉద‌యం 7గంట‌ల‌కు ముంబైలో షూటింగ్‌కు బ‌య‌లుదేరాడు. త‌న కారులో కూర్చుని ముసుగు ధ‌రించిన ఫొటోను సోష‌ల్‌మీడియాలో షేర్ చేశాడు.
 
ఆయ‌న పాంగోలిన్ మాస్క్ ధ‌రించారు. 800 నుంచి 5వేల వ‌ర‌కు వున్న ఈ మాస్క్‌ను ఆయ‌న ధ‌రించి చూపించాడు. ఇందులో ర‌క‌ర‌కాల మోడ‌ల్స్ కూడా వున్నాయి.ఇదిలావుండ‌గా, ఇప్పుడు అంద‌రం మ‌రింత జాగ్ర‌త్త‌గా వుండాల్సిన అవ‌స‌రం వుంద‌నీ, ప్ర‌తిరోజూ ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న‌కు మ‌నం మాస్క్‌లు ధ‌రించి ఎక్క‌డికైనా వెళ్ళాల‌నే విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని తెలియ‌జేశారు. సినిమా షూటింగ్ అంటే రోజూ వంద‌లాదిమందితో ప‌నిచేయాల్సి వుంటుంది క‌నుక ఆయ‌న చెప్పింది క‌రెక్టే అని ప‌లువురు ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

ప్ర‌స్తుతం అమితాబ్ `బ్ర‌హ్మాస్త్ర`, `చెహ్రె, మేడే, గుడ్‌బై చిత్రాలు చేస్తున్నారు. దానితోపాటు ఓ హాలీవుడ్ సినిమా రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఇక ప్ర‌భాస్‌, దీపికా ప‌దుకొనే సినిమాలోనూ ఆయ‌న న‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments