Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబాలిని బీజేపీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందా? రజనీకాంత్ ఒప్పుకుంటారా?

కబాలి హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీలో చేరుతారని జోరుగా చర్చ సాగుతోంది. కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. రజనీకి రాజకీయాలొద్దని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రజనీకాంత్ రాజకీయాల వైపు ద

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (12:17 IST)
కబాలి హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీలో చేరుతారని జోరుగా చర్చ సాగుతోంది. కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. రజనీకి రాజకీయాలొద్దని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రజనీకాంత్ రాజకీయాల వైపు దృష్టి పెట్టకూడదనుకుంటున్నట్లు కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఇప్పటికే తమిళ రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్న వేళ... తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ సర్వం సిద్ధం చేసుకుంటోంది. 
 
ప్రస్తుత అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ సన్నద్ధమైనట్లు సమాచారం. రజనీతో ఆరెస్సెస్ నేత గురుమూర్తి ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడారని చెబుతున్నారు. అయితే, రజనీ నుంచి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
 
ఏదేమైనప్పటికీ, ఈ వార్త తమిళనాడులో సంచలనంగా మారింది. రాజకీయపరంగా మరింత వేడిని పెంచుతోంది. ఇదిలా ఉంచితే, ఈ ప్రచారంలో వాస్తవం లేదని గురుమూర్తి శుక్రవారమే ప్రకటించారు. రజనీకాంత్ బీజేపీలో టచ్ ఉన్నారని, వీరద్దరి మధ్య ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త గురుమూర్తి సయోధ్య కుదురుస్తున్నారంటూ మీడియో తెగ హడావిడి చేసింది. 
 
రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలన్నీ ఉత్తుత్తిదేనని.. రజనీకాంత్‌ కొత్త పార్టీ ఏర్పాటు అనేది అవాస్తం అని గురుమూర్తి స్పష్టం చేశారు. రజనీకాంత్ బీజేపీతో చర్చలు జరుపుతున్నారంటూ వస్తున్న ప్రచారమంతా ఓ కట్టుకథ, అభూత కల్పన అని కొట్టిపారేశారు. మీడియాలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రసారం చేస్తారో అర్థం కావడం లేదని ట్వీట్‌ చేసిన రజనీకాంత్ ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన రష్యా.. మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి...

లండన్‌లో జల్సాలు - పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా - లలిత్ మోడీ!

కోల్‌కతా న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు...

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments