Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఠాగూర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (10:26 IST)
గత కొన్ని రోజులుగా ప్రత్యర్థులుగా ఉన్న హీరో ధనుష్, హీరోయిన్ నయనతారలు ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. నిర్మాత ఆకా్ భాస్కర్ వివాహానికి ఈ ఇద్దరూ హాజరయ్యారు. ధనుష్ ఒంటరి రాగా, నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి వచ్చారు. 
 
ఇక సినీ పరిశ్రమకు చెందినవారికి వివాహ వేదికలో ముందు వరుస కుర్చీలను కేటాయించారు. దాంతో ధనుష్, నయనతార ఒకే వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. అయితే, ఆ ఇద్దరూ కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి కూడా తొలుత సెలెబ్రిటీలు వెళ్లగా.. అక్కడ కూడా నయనతార, ధనుష్ ఎడమొఖం, పెడమొఖంగానే ఉన్నారు. ఈ వీడియోను నయనతార, విఘ్నేష్ శివన్ సెక్యూరిటీ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
దీనిపై ఇరువురు అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. నయనతార, ధనుష్ మధ్య గత కొన్ని రోజులుగా వైరం కొనసాగుతుంది. నయనతార జీవిత చరిత్ర ఆధారంగా ఓ డాక్యుమెంటరీ తెరకెక్కింది. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే పేరుతో దీన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తయారు చేసింది. 
 
ఇందులో 'నేనూ రౌడీనే' అనే సినిమా నుంచి 3 సెకన్ల క్లిప్పింగ్‌ను నయనతార వాడుకున్నారు. ఈ చిత్రానికి నిర్మాత ధనుష్ కావడంతో తన అనుమతి లేకుండా క్లిప్పింగ్‌ను వాడుకున్నందుకు రూ.10 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు నోటీసులు పంపారు. తాము ధనుష్ నుంచి ఎన్ఎసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కోసం రెండేళ్లపాటు ఎదురుచూశామని, కానీ ఆయన స్పందించలేదంటూ నయనతార ఆరోపించారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments