శ్రీనువైట్ల కిడ్స్‌తో ఇలియానా.. అమెరికాలో ఏం చేస్తోందో తెలుసా?

టాలీవుడ్‌లో ''దేవదాసు'' సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టిన ఇలియానా ఆపై.. వరుస హిట్లతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా దక్షిణాది అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న ఇలియానా రవితేజతో చేసిన ''దేవుడు చ

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (13:38 IST)
టాలీవుడ్‌లో ''దేవదాసు'' సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టిన ఇలియానా ఆపై.. వరుస హిట్లతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా దక్షిణాది అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న ఇలియానా రవితేజతో చేసిన ''దేవుడు చేసిన మనుషులు'' తర్వాత టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ ఈ గోవా బ్యూటీ నాలుగైదు సినిమాలుచేసింది. ప్రస్తుతం మళ్లీ రవితేజ సినిమా ''అమర్ అక్బర్ ఆంటోనీ'' ద్వారానే టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. 
 
శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా ''అమర్ అక్బర్ ఆంటోని'' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో ఇలియానా పాల్గొంది. ఈ షూటింగ్‌లో రవితేజ, ఇలియానా కాంబినేషన్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం శ్రీనువైట్ల కుటుంబం కూడా అమెరికా వచ్చింది. 
 
ఈ సందర్భంగా షూటింగులో జాయిన్ అయిన ఇలియానాకి స్పెషల్‌గా పిల్లలు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. వాళ్లు చూపించిన ప్రేమానురాగాలకు ఇలియానా మురిసిపోతూ థ్యాంక్స్ చెప్పింది. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
 
మరోవైపు ఇలియానా తన ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో సహజీవనం చేస్తోంది. ఇద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై క్లారిటీ ఇవ్వమంటే... అది తన వ్యక్తిగతమని దాటవేసింది. అంతేగాకుండా.. ఇటీవల హీరోయిన్ ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన టాప్‌లెస్ ఫోటోతో పాటు దాని కింద చేసిన కామెంట్ హాట్ టాపికైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

25 ఏళ్ల జానపద గాయని మైథిలీ ఠాకూర్ చేతిలో ఓడిపోతున్న ఉద్ధండ నాయకుడు బినోద్ మిశ్రా

పరకామణి చోరీ కేసు : ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో అనుమానాస్పద మృతి

గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నాడు.. యువతి ఆవేదన (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments